గాసిప్స్ న్యూస్

కమల్ హాసన్ విక్రం కి హిందీ లో ఆల్ ఇండియా రికార్డ్ బిజినెస్!

లోక నాయకుడు కమల్ హాసన్ హీరోగా సినిమా ఆడియన్స్ ముందుకు వచ్చి చాలా టైం అవుతుంది, శంకర్ డైరెక్షన్ లో ఇండియన్ 2 సినిమా ఈ పాటి కే ఎప్పుడో రావాల్సింది కానీ అనుకోని కారణాల వలన ఆ సినిమా మధ్య లోనే ఆగి పోవాల్సి రాగా ఈ సినిమా తర్వాత కమల్ హాసన్ ఖైదీ, మాస్టర్ ఫేమ్ లోకేష్ కనగరాజ్ డైరెక్షన్ లో విక్రం సినిమా చేస్తున్న విషయం అందరి కీ తెలిసిందే.

కాగా ఈ సినిమాలో కమల్ హాసన్ కి తోడు గా విజయ్ సేతుపతి మరియు ఫహాద్ ఫాజిల్ లు కూడా ముఖ్య పాత్రలు పోషిస్తూ ఉండటం తో సినిమా పై సౌత్ లో విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. ఇక ఈ సినిమా కోసం హిందీ ఆడియన్స్ కూడా ఆశగా ఎదురు చూస్తున్నారు.

సౌత్ మూవీస్ చాలా వరకు రిలీజ్ అయిన తర్వాత వాటి హిందీ డబ్బింగ్ రైట్స్ ని కొని సినిమాలను టెలివిజన్ లో తర్వాత యూట్యూబ్ ఛానెల్ లో టెలికాస్ట్ చేస్తారు అన్న విషయం అందరికీ తెలిసిందే… టాలీవుడ్ మూవీస్ ఎక్కువగా భారీ రేట్ల ను సొంతం చేసుకుంటూ ఉంటాయి కానీ…

ఈ సినిమా లో ఏకంగా ముగ్గురు స్టార్స్ కలిసి నటిస్తున్న నేపధ్యంలో సినిమా పై ఉన్న హైప్ దృశ్యా హిందీ లో ఇప్పటి వరకు ఏ సినిమా కి కూడా దక్కని రేటు ని ఈ సినిమా కి ఇచ్చారు అంటున్నారు ఇప్పుడు. ఆల్ మోస్ట్ 36 కోట్ల మమ్మోత్ రేటు కి హిందీ శాటిలైట్ రైట్స్ అలాగే యూట్యూబ్ రైట్స్ అమ్ముడు పోయాయాట…

ఇది అన్ని మూవీస్ లో ఆల్ టైం బిగ్గెస్ట్ రేటు గా చెప్పవచ్చు. ఈ రేంజ్ రేటు అంటే ఆల్ మోస్ట్ సౌత్ లో ఇతర భాషల్లో బిజినెస్ కన్నా ఎక్కువే అని చెప్పాలి. ఈ రేంజ్ రేటు ని సొంతం చేసుకున్న ఈ సినిమా రిలీజ్ అయిన 2 నెలల తర్వాత హిందీ లో డబ్ వర్షన్ టెలికాస్ట్ అయ్యి తర్వాత యూట్యూబ్ లో వస్తుందని అంటున్నారు ఇప్పుడు.

Leave a Comment