గాసిప్స్ న్యూస్

కరోనా మీద సినిమా…40% కంప్లీట్ చేసిన యంగ్ డైరెక్టర్!

  టాలీవుడ్ యంగ్ డైరెక్టర్స్ లో షాట్ ఫిలిమ్స్ తో ముందు ఇంప్రెస్ చేసి తర్వాత వెండితెరపై డిఫెరెంట్ కాన్సెప్ట్ మూవీస్ తో ఇంప్రెస్ చేసిన డైరెక్టర్స్ లో యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ కూడా ఒకరు. ఇప్పటి వరకు టాలీవుడ్ లో ఎవ్వరూ టచ్ చేయని కాన్సెప్ట్ తో అ! అనే డిఫెరెంట్ కాన్సెప్ట్ మూవీ తో మెప్పించిన ఈ డైరెక్టర్ తర్వాత సీనియర్ హీరో అయిన రాజశేఖర్ తో కల్కి…

అనే మరో డిఫెరెంట్ మూవీ చేసి మెప్పించాడు. రాజ శేఖర్ మార్కెట్ పూర్తిగా పడిపోవడం వలన ఆ సినిమా అనుకున్న రేంజ్ లో ఆడలేదు కానీ ఎవరైనా మార్కెట్ ఉన్న హీరో తో చేసి ఉంటె మంచి రిజల్ట్ ని సినిమా ఇచ్చి ఉండేది. ఇక ఈ రెండు సినిమాల తర్వాత…

ప్రశాంత్ వర్మ ఎలాంటి సినిమా చేస్తాడు అన్నది ఆసక్తిగా మారగా ప్రస్తుతం అందరినీ ఇళ్ళలోకే పరిమితం అయ్యేలా చేసిన కరోనా పైనే సినిమా తీయాలి అని ఫిక్స్ అయ్యాడు ప్రశాంత్ వర్మ. లాక్ డౌన్ టైం లోనే కరోనా పై దాని వాక్సిన్ పై సినిమా చేస్తున్నానని పోస్టర్ రిలీజ్ చేయగా…

లాక్ డౌన్ తర్వాత షూటింగ్స్ కి పర్మీషణ్ ఇవ్వగా అందరూ దాదాపుగా ఇళ్ళకే పరిమితం అవ్వగా ప్రశాంత్ వర్మ మాత్రం సైలెంట్ గా మూవీ ని మొదలు పెట్టి ఏకంగా 40% సినిమా ను కూడా కంప్లీట్ చేశాడు అన్నది లేటెస్ట్ టాలీవుడ్ టాక్. 40% షూటింగ్ అంటే మామూలు విషయం కాదనే చెప్పాలి.

ఎలాంటి ఇబ్బంది లేకుండా కరోనా భారిన ఎవ్వరూ పడకుండా జాగ్రత్తలు తీసుకుంటూ 40% పూర్తీ అయిన ఈ సినిమా ఈ ఏడాది ఎండ్ టైం కల్లా దాదాపుగా షూటింగ్ ని కంప్లీట్ చేసుకుంటుంది అని అంటున్నారు. సినిమా లో ఎవరెవరు నటిస్తున్నారు లాంటి విశేషాలు ఏవి పెద్దగా బయటికి రానివ్వకుండా సర్ప్రైజ్ చేయడానికి సిద్ధం అవుతుంది టీం. మరి సినిమా మొదటి 2 సినిమాల మాదిరిగా ఉంటె ఈ సారి కచ్చితంగా తన మార్క్ చూపెట్టే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి…

Leave a Comment