న్యూస్ బాక్స్ ఆఫీస్

కలర్ ఫోటో ఫస్ట్ డే కలెక్షన్స్….3 కోట్ల రేటుకి ఈ రేంజ్ భీభత్సం ఏంటి సామి!!

సుహాస్ చాందిని చౌదరి ల కాంబినేషన్ లో సందీప్ రాజ్ డైరెక్షన్ లో తెరకెక్కిన లేటెస్ట్ లవ్ స్టొరీ కలర్ ఫోటో…. మంచి ఫీల్ గుడ్ మూవీ గా వచ్చిన ఈ సినిమా సాంగ్స్ అండ్ టీసర్ తోనే అంచనాలను మించిపోగా… సినిమా రీసెంట్ గా ఆహా యాప్ లో డైరెక్ట్ రిలీజ్ ని సొంతం చేసుకుంది… కాగా సినిమా కథ రొటీన్ గానే ఉండటం తో అన్ని సైట్స్ ఆల్ మోస్ట్…

సినిమా బాగుంది కానీ మరీ అద్బుతం కాదు అన్న విధంగా రివ్యూలు ఇచ్చాయి, కానీ ఆడియన్స్ ఇవేవి మినిమమ్ కేర్ చేయకుండా సినిమా ను ఎగబడి చూశారు మొదటి రోజు… ఆహా యాప్ లో సినిమా సాధించిన మొదటి రోజు యూనిక్ వ్యూస్ ఇప్పుడు….

ట్రేడ్ వర్గాల్లో చక్కర్లు కొడుతున్నాయి…. వాటి వివరాలను ఒకసారి గమనిస్తే… మొదటి రోజు ఆహా యాప్ లో ఈ సినిమా కి సుమారు 2 లక్షల 15 వేల రేంజ్ యూనిక్ వ్యూస్ దక్కినట్లు సమాచారం. చిన్న సినిమానే అయినా ఇవి సెన్సేషనల్ వ్యూస్ అనే చెప్పాలి. ఇక సినిమా కి ఈ రేంజ్ వ్యూస్ కి…

కలెక్షన్స్ ఎంత వరకు వచ్చి ఉంటాయి అన్నది ఎస్టిమేట్ చేస్తే… ఆహా యాప్ 3 నెలల సబ్ స్క్రిప్షన్ రేటు 150 కాగా ఒక నెలకి 50 అనుకుని అదే సినిమా టికెట్ రేటు గా భావిస్తే 215000 యూనిక్ వ్యూస్ కి 50 టికెట్ రేటు తో మొదటి రోజు మొత్తం మీద కలర్ ఫోటో సినిమా కి 1 కోటి 7 లక్షల 50 వేల దాకా…

కలెక్షన్స్ వచ్చి ఉంటాయని అంచనా వేయవచ్చు…. ఇది నిజంగానే అల్టిమేట్ కలెక్షన్స్ గా భావించవచ్చు… సినిమా థియేటర్స్ లో రిలీజ్ అయినా ఇలాంటి వసూళ్ళని అందుకునేది. ఇవే లెక్కలు నిజం అనుకుంటే సినిమాను 3 కోట్లు పెట్టి కొన్న ఆహా యాప్ వాళ్లకి మొదటి వారంలో టోటల్ పెట్టుబడి తిరిగి వచ్చేసే అవకాశం ఎంతైనా ఉంటుందని చెప్పొచ్చు.

Leave a Comment