న్యూస్ బాక్స్ ఆఫీస్ స్పెషల్

కలెక్షన్స్ పై మహేష్ షాకింగ్ కామెంట్స్….టోటల్ టాలీవుడ్ షాక్!!

సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన లేటెస్ట్ మూవీ మహర్షి బాక్స్ ఆఫీస్ దగ్గర 10 రోజులలో 81.6 కోట్లకు పైగా షేర్ ని అందుకుని కెరీర్ బెస్ట్ కలెక్షన్స్ వైపు ఒక్కో అడుగు ముందు కేస్తూ దూసుకు పోతుంది, ఇలాంటి సమయం లో సినిమా పబ్లిసిటీ ని పెంచుతూ మహేష్ నిరంతరం సినిమా ను ప్రమోట్ చేస్తూ ఈ మధ్య కాలం లో మరే హీరో కూడా ఇవ్వనన్ని ఇంటర్వ్యూలు సక్సెస్ మీట్లు, ఇలా అన్నీ తానై సినిమా ను ప్రమోట్ చేస్తున్నాడు.

ఆ ఇంపాక్ట్ కలెక్షన్స్ పై పడటం అంతా బాగున్నా మహేష్ చేసిన కొన్ని కామెంట్స్ మాత్రం ఇండస్ట్రీ లో షాక్ కి గురి చేస్తుంది. ఇప్పటి వరకు జరిగిన ఈవెంట్స్ లో మూడు సార్లు మహేష్ నా కెరీర్ బెస్ట్ రికార్డులను మహర్షి ఫస్ట్ వారంలో నే బీట్ చేసింది అంటూ…

ఒకే కామెంట్ ని పలు మార్లు చెప్పాడు. అలా చెప్పడానికి రీజన్స్ ఏంటి అనేది పక్కకు పెడితే ఆ స్టేట్ మెంట్ మాత్రం అటు ఫ్యాన్స్ కి ఇటు ఇండస్ట్రీ కి అర్ధం కావడం లేదు అని చెప్పాలి. తన కెరీర్ లో శ్రీమంతుడు 87 కోట్లు, భరత్ అనే నేను 101 కోట్లు టాప్ మూవీస్.

వాటిని మహర్షి ఇంకా అందుకోలేదు. కానీ ఫస్ట్ వీక్ లోనే రికార్డ్ బ్రేక్ అయ్యాయి అంటే శ్రీమంతుడు బ్రేక్ అయ్యింది, కానీ భరత్ అనే నేను కి  మొదటి వారం లోనే 161 కోట్ల గ్రాస్ అంటూ పోస్టర్ వదిలారు. కానీ మహర్షి కి ఫస్ట్ వీక్ లో 130 కోట్లకు పైగానే గ్రాస్ వచ్చింది.

ఏ లెక్కన చూసుకున్నా మహర్షి ఇంకా ఆ 2 సినిమాలను అందుకోలేదు, కానీ ఇలా స్టేట్ మెంట్స్ ఇవ్వడం తో సోషల్ మీడియాలో ఇతర హీరోల ఫ్యాన్స్ పాత సినిమా కలెక్షన్స్ ఫేట్ అంటూ నెగటివ్ కామెంట్స్ చేస్తున్నారు. ఫ్యాన్స్ డిఫెండ్ చేసుకోలేక పోతున్నారు. ఫైనల్ గా ఆ స్టేట్ మెంట్ కి అర్ధం ఏంటో మహేష్ కే తెలియాలి.

Leave a Comment

Do NOT follow this link or you will be banned from the site!