న్యూస్ బాక్స్ ఆఫీస్ స్పెషల్

కలెక్షన్స్ పై మాట నిలుపుకున్న రామ్ చరణ్…!!

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి నటించిన లేటెస్ట్ మూవీ సైరా నరసింహా రెడ్డి బాక్స్ ఆఫీస్ దగ్గర 8 రోజుల్లో టోటల్ వరల్డ్ వైడ్ గా 200 కోట్ల గ్రాస్ మార్క్ ని అందు కుని సంచలనం సృష్టించింది, కానీ బ్రేక్ ఈవెన్ అవ్వాలి అంటే సినిమా మరింత కష్ట పడాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పొచ్చు. ఇక సినిమా నిర్మాత అయిన రామ్ చరణ్ ఒక విషయం లో మాట నిలుపు కున్నాడు అని చెప్పు కోవాలి.

సినిమాల కలెక్షన్స్ ని పోస్టర్స్ పై ప్రింట్ చేయడం అన్నది ఎప్పటి నుండో కొనసాగుతున్న ఆచారం అన్న విషయం తెలిసిందే. మొదటి రోజు మొదటి వీకెండ్ మొదటి వారం లైఫ్ టైం ఇలా పోస్టర్స్ పై సినిమా సాధించిన కలెక్షన్స్ ని వేస్తూ సినిమా కి మరింత పబ్లిసిటీ చేస్తుంటారు యూనిట్ వర్గాలు.

ఇక లాస్ట్ ఇయర్ రంగస్థలం సినిమా అల్టిమేట్ కలెక్షన్స్ తో దూసుకు పోతున్న తరుణంలో సినిమా అప్పటికే 200 కోట్ల మార్క్ ని అందుకున్నా నిర్మాతలు ఆ పోస్టర్ వదలాల్సింది 185 కోట్ల పోస్టర్ ని వదిలి తప్పు జరిగింది అని తెలుసుకుని తర్వాత 2 – 3 రోజుల టైం కి 200 కోట్ల పోస్టర్ ని వదిలారు.

దాంతో సోషల్ మీడియా లో అప్పటి వరకు సినిమా పై కలెక్షన్స్ పై ఉన్న పాజిటివిటీ కాకుండా కలెక్షన్స్ ఫేక్ చేస్తున్నారు అంటూ ఇతర హీరోల ఫ్యాన్స్ భారీ ఎత్తున ట్రోల్ చేశారు. ఇది రామ్ చరణ్ వరకు రావడం తో అప్పటి కప్పుడు ప్రెస్ మీట్ లో ఇక మీదట నా సినిమాల పోస్టర్స్ పై…

కలెక్షన్స్ గురించిన పోస్టర్స్ ఏవి ఉండవని ఇది ఇప్పటి నుండి చేయబోయే సినిమాలకి కూడా వర్తిస్తుందని చెప్పుకొచ్చాడు. అన్నట్లు గానే తానూ నటించిన కొత్త సినిమా వినయ విదేయ రామ సమయం లో పోస్టర్స్ లో కలెక్షన్స్ గురించిన ఎలాంటి గ్రాస్ పోస్టర్స్ రిలీజ్ చేయలేదు.

ఇక రామ్ చరణ్ నిర్మాతగా వ్యవహిరించిన మెగా మమ్మోత్ మూవీ సైరా నరసింహా రెడ్డి రిలీజ్ అయ్యి ఇప్పటి వరకు 200 కోట్ల దాకా గ్రాస్ ని వసూల్ చేయగా సినిమా కలెక్షన్స్ పై పోస్టర్స్ లో ఇప్పటి వరకు ఎలాంటి గ్రాస్ పోస్టర్స్ ని రిలీజ్ చేయలేదు రామ్ చరణ్ అండ్ యూనిట్ వర్గాలు.

దాంతో తన నిర్ణయం తానూ నటించిన సినిమాలకే కాకుండా నిర్మించిన సినిమాలకు కూడా ఫాలో అవుతూ కలెక్షన్స్ పోస్టర్స్ పై తన వ్యతిరేకత ని కంటిన్యు చేస్తున్నాడు రామ్ చరణ్, ఈ కలెక్షన్స్ పోస్టర్స్ వలన ఫ్యాన్స్ మధ్య గొడవలు తప్పితే పెద్దగా ఉపయోగం లేదు అన్నది అందరికీ తెలిసిందే.

సినిమా కలెక్షన్స్ ఎంతో అని చెప్పడానికి ఇప్పటికే టాలీవుడ్ లో లెక్కకు మిక్కిలి బాక్స్ ఆఫీస్ వెబ్ సైట్స్ ఉన్నాయి. ఇలాంటి సమయంలో గ్రాస్ పోస్టర్స్ లెక్కలతో ఫ్యాన్స్ కి మరింత తికమక లు ఎక్కువ అవుతాయి కానీ క్లారిటీ ఉండదు అని యూనిట్ వర్గాలు భావిస్తున్నట్లు సమాచారం.

Leave a Comment