న్యూస్ బాక్స్ ఆఫీస్

కల్కి కలెక్షన్స్: అమ్మింది 11 కోట్లు….10 రోజుల్లో వచ్చింది ఇది!! పాపం!!

యాంగ్రీ యంగ్ మాన్ రాజశేఖర్ గరుడ వేగ సినిమా తర్వాత చేసిన సినిమా కల్కి. మంచి అంచనాల నడుమ రిలీజ్ అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర కలెక్షన్స్ పరంగా మాత్రం తీవ్రంగా నిరాశ పరిచింది. సినిమా టాక్ పర్వాలేదు… ఒకసారి చూడొచ్చు అనే విధంగా ఉన్నా కానీ కలెక్షన్స్ పరంగా సినిమా ఏమాత్రం జోరు చూపలేక పోయింది.

10 రోజులు ముగిసే సమయానికి సినిమా రెండు తెలుగు రాష్ట్రాలలో మొత్తం మీద 2.34 కోట్ల షేర్ ని మాత్రమె సాధించింది. ఇక వరల్డ్ వైడ్ గా టోటల్ గా 2.74 కోట్ల షేర్ ని మాత్రమె అందుకుని షాక్ ఇచ్చింది ఈ సినిమా. ఏకంగా సినిమాను 11 కోట్లకు అమ్మగా…

సినిమా ఇప్పటి వరకు సాధించిన షేర్ కాకుండా మరో 9.26 కోట్ల షేర్ ని అందుకుంటేనే బాక్స్ ఆఫీస్ దగ్గర క్లీన్ హిట్ అవుతుంది. అది దాదాపు అసాధ్యంగా కనిపిస్తుండటంతో ఫైనల్ రన్ లో సినిమా 3 కోట్ల రేంజ్ లో ముగించి భారీ డిసాస్టర్ గా నిలిచే అవకాశం ఉందని చెప్పొచ్చు… న్యూస్ అప్ డేట్స్ కోసం బెల్ ఐకాన్ ని ప్రెస్ చేసి సబ్ స్బైబ్ చేసుకోండి.. అప్ డేట్ రాగానే నోటిఫికేషన్ మీకు అందుతుంది.

Leave a Comment