న్యూస్ బాక్స్ ఆఫీస్

కల్కి 2 డేస్ కలెక్షన్స్!!

యాంగ్రీ మ్యాన్ రాజశేఖర్ నటించిన లేటెస్ట్ మూవీ కల్కి బాక్స్ ఆఫీస్ దగ్గర రీసెంట్ గా రిలీజ్ అయ్యి పర్వాలేదు అనిపించే టాక్ ని సొంతం చేసుకుంది, కానీ సినిమా బిజినెస్ ఎక్కువ అవ్వడం తో బాక్స్ ఆఫీస్ దగ్గర అనుకున్న రేంజ్ లో అయితే ఓపెనింగ్స్ ని సొంతం చేసుకోలేదు అని చెప్పాలి. మొదటి రోజు రెండు రాష్ట్రాలలో 91 లక్షల షేర్ ని వరల్డ్ వైడ్ గా 1.16 కోట్ల షేర్ ని సాధించింది.

ఇక రెండో రోజు మొత్తం మీద రెండు తెలుగు రాష్ట్రాలలో 52 లక్షల షేర్ ని వరల్డ్ వైడ్ గా 60 లక్షల షేర్ ని అందుకుంది, దాంతో 2 రోజుల్లో రెండు రాష్ట్రాలలో 1.43 కోట్ల షేర్ ని వరల్డ్ వైడ్ గా 1.76 కోట్ల షేర్ ని సినిమా అందుకుంది.

సినిమాను 11 కోట్లకు అమ్మగా 12 కోట్ల టార్గెట్ తో బరిలోకి దిగిన సినిమా బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే… మరో 10.24 కోట్ల షేర్ ని అందుకోవాల్సి ఉంటుంది. మరి ఆదివారం సినిమా బాక్స్ ఆఫీస్ పెర్ఫార్మెన్స్ ఎలా ఉంటుంది అన్నది ఆసక్తిగా మారింది.

Leave a Comment

Do NOT follow this link or you will be banned from the site!