న్యూస్ ప్రీ రిలీజ్ బిజినెస్ బాక్స్ ఆఫీస్

కాంచన 3 తెలుగు బిజినెస్…ఊరమాస్!!

మల్టీ టాలెంటెడ్ రాఘవ లారెన్స్ లేటెస్ట్ మూవీ కాంచన 3 ప్రేక్షకుల ముందుకు ఈ శుక్రవారం రాబోతున్న విషయం తెలిసిందే, సినిమా ఓవరాల్ గా రెండు తెలుగు రాష్ట్రాలలో సాలిడ్ ప్రీ రిలీజ్ బిజినెస్ ని సొంతం చేసుకుంది, ఇది వరకు వచ్చిన ముని గంగ కాంచన పేర్లతో వచ్చిన సినిమాల రిజల్ట్ తెలుగు లో అద్బుతంగా ఉండటం తో కాంచన 3 కి తెలుగు లో బిజినెస్ సాలిడ్ గా జరిగింది, సినిమా నైజాం ఏరియాలో…

4 కోట్ల బిజినెస్ ని, సీడెడ్ అండ్ ఆంధ్ర రెండు కలిపి 6 కోట్ల రేంజ్ లో బిజినెస్ ని సొంతం చేసుకోగా రెండు రాష్ట్రాలలో కలిపి 10 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ ని అందుకుంది, ఇక సినిమా రెండు రాష్ట్రాలలో మొత్తం మీద 400 వరకు థియేటర్స్ లో భారీ గా రిలీజ్ కానుంది.

సినిమా పై హైప్ బాగానే ఉండటం తో బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి ఓపెనింగ్స్ ని సినిమా సొంతం చేసుకునే అవకాశం ఉంది, ఎంతలేదన్నా 2 కోట్ల రేంజ్ లో ఓపెనింగ్స్ ని కాంచన 3 బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకునే అవకాశం ఉందని చెప్పొచ్చు. న్యూస్ అప్ డేట్స్ కోసం బెల్ ఐకాన్ ని ప్రెస్ చేసి సబ్ స్బైబ్ చేసుకోండి.. అప్ డేట్ రాగానే నోటిఫికేషన్ మీకు అందుతుంది.

Leave a Comment

Do NOT follow this link or you will be banned from the site!