న్యూస్ స్పెషల్

కాపీ ఆరోపణలు ఎదురుకుంటున్న “రాధేశ్యామ్”

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ పూజా హెడ్గే ల కాంబినేషన్ లో జిల్ ఫేమ్ రాదా కృష్ణ డైరెక్షన్ లో యువి క్రియేషన్స్ మరియు టి సిరీస్ కలిసి నిర్మిస్తున్న భారీ బడ్జెట్ మూవీ రాధే శ్యామ్…. సాహో రిలీజ్ తర్వాత ఆల్ మోస్ట్ 10 నెలలకు పైగా టైం తీసుకుని రిలీజ్ అయిన ప్రభాస్ లేటెస్ట్ మూవీ టైటిల్ అండ్ ఫస్ట్ లుక్ కి రెస్పాన్స్ మాత్రం సాలిడ్ గానే దక్కుతుంది.

ఒక పక్క ఫ్యాన్స్ ఫస్ట్ లుక్ విషయం లో బిగ్గెస్ట్ ఫస్ట్ లుక్ అండ్ టైటిల్ అనౌన్స్ మెంట్ ట్రెండ్స్ లో రికార్డులు సృష్టించడానికి సిద్ధం అవుతున్నారు. అదే సమయంలో సినిమా ఫస్ట్ లుక్ వేరే సినిమాల పోస్టర్ లను కాపీ కొట్టి డిసైన్ చేశారు అంటూ ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి.

2013 లో సంజయ్ లీలా భన్సాలి డైరెక్షన్ లో వచ్చిన రామ్ లీల పోస్టర్ అలాగే క్రిష్ డైరెక్షన్ లో వచ్చిన కంచే సినిమాల పోస్టర్స్ ని ఇన్ స్పైర్ అయ్యి రాధే శ్యామ్ పోస్టర్ డిసైన్ ని సిద్ధం చేశారని ట్రోల్ చేస్తున్నారు. మూడు పోస్టర్స్ ని పక్క పక్కన చూస్తె…

ఇది కూడా నిజమే అనిపిస్తుంది కానీ టోటల్ డీటైల్స్ మాత్రం వేటికవే డిఫెరెంట్ గానే ఉన్నాయి… కానీ మెయిన్ హీరో హీరోయిన్స్ పోస్ అండ్ లుక్ మాత్రం సేం టు సేం ఉన్నాయి అనేది అందరి కంప్లైంట్… యూనిట్ ఆల్ రెడీ మూడు నెలలుగా ఊరించి ఊరించి ఆఖరికి కాపీ పోస్టర్ ని వదిలారు అంటున్నారు.

ఈ విమర్శలు పక్కకు పెడితే సినిమా కి ఇటు టాలీవుడ్ నుండి టోటల్ ఇండియా మొత్తం కూడా ఫుల్ పాజిటివ్ రెస్పాన్స్ అయితే వస్తుంది అని చెప్పాలి. ఇక ఇప్పటికే 70% షూటింగ్ ని పూర్తీ చేసుకున్న ఈ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇక ఫ్యాన్స్ 24 గంటల్లో బిగ్గెస్ట్ టైటిల్ అండ్ ఫస్ట్ లుక్ ట్రెండ్స్ రికార్డులు సృష్టించడానికి సిద్ధం అవుతున్నారు…

Leave a Comment