న్యూస్ వీడియో

కీర్తి సురేష్..పెంగ్విన్ ట్రైలర్ రివ్యూ…కుమ్మిందిగా!!

మహానటి సినిమా తో అందరి మనసులను గెల్చుకుని భారీ విజయాన్ని సొంతం చేసుకున్న కీర్తి సురేష్ ఆ సినిమా తర్వాత చాలా తక్కువ సినిమాలే చేస్తుంది, హీరోయిన్ గా కానుండా ఎక్కువగా లేడీ ఓరియెంటెడ్ మూవీస్ ఒప్పుకున్న కీర్తి సురేష్ తెలుగు లో మిస్ ఇండియా ని చేయగా తమిళ్ లో పెంగ్విన్ అనే డిఫెరెంట్ మూవీ ని ఒప్పుకుంది, కాగా షూటింగ్ పూర్తీ చేసుకున్న ఈ సినిమా ఇప్పుడు డైరెక్ట్ గా…

డిజిటల్ రిలీజ్ కి సిద్ధం అవుతుంది, జూన్ 19 న డైరెక్ట్ గా అమెజాన్ ప్రైమ్ లో రిలీజ్ కాబోతున్న ఈ సినిమా అఫీషియల్ టీసర్ ని రీసెంట్ గా రిలీజ్ చేయగా రెస్పాన్స్ బాగానే వచ్చినా రీచ్ అంతగా లేదు, కానీ ఇప్పుడు లేటెస్ట్ గా సినిమా థియేట్రికల్ ట్రైలర్ ని రిలీజ్ చేశారు.

ట్రైలర్ చూసిన తర్వాత సినిమా ఎలా ఉండబోతుంది, ఏ ఆడియన్స్ ని టార్గెట్ చేసి సినిమా తీశారు అన్నది ఆల్ మోస్ట్ కన్ఫాం అయింది, సైకో థ్రిల్లర్ జానర్ లో తెరకెక్కిన ఈ సినిమా కీర్తి సురేష్ మెయిన్ రోల్ చేస్తుంది, సంతోష్ నారాయణ్ మ్యూజిక్ అందించిగా..

పేట సినిమా తీసిన కార్తిక్ సుబ్బరాజ్ నిర్మాణంలో తెరకెక్కుతుంది ఈ సినిమా. ఇక ట్రైలర్ లో ఒక చినబాబు మిస్ అవ్వగా అతన్ని వెతికే క్రమం లో ఒక సైకో వ్యక్తీ గురించి తెలుస్తుంది, అసలు ఆ సైకో ఎవరు చిన్న పిల్లలను ఎందుకు హింసిస్తున్నాడు అన్న అంశాలు అన్నీ సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. ఇలాంటి సైకో థ్రిల్లర్ జానర్ మూవీస్ ఇష్టపడే వారికి…

ట్రైలర్ తోనే మంచి ఇంప్రెషన్ అయితే దక్కింది, ఇక బ్యాగ్రౌండ్ స్కోర్ అయితే చాలా బాగా ఉందని చెప్పాలి. విజువల్స్ మాత్రం కొంచం డార్క్ గా అనిపించినా జానర్ దృశ్యా డిఫెరెంట్ గా ప్లాన్ చేస్తున్నారు. మొత్తం మీద ట్రైలర్ అయితే కుమ్మింది అని చెప్పాలి. ఇక సినిమా ఎలా ఉంటుందో జూన్ 19 న తెలుస్తుంది…

Leave a Comment