న్యూస్ రివ్యూ

కుడి ఎడమైతే రివ్యూ…తెలుగు లో ఇప్పటి వరకు ఇదే బెస్ట్!

థియేటర్స్ లో సినిమాలు లేక పోవడం తో డిజిటల్ లో రిలీజ్ అయ్యే సిరీస్ లు సినిమాలను చూస్తున్న ఆడియన్స్ కి తెలుగు లో సిరీస్ లు బాగానే వస్తున్న కానీ ఏవి కూడా అంచనాలను అందుకునే రేంజ్ లో అయితే ఉండటం లేదు. కానీ రీసెంట్ గా ఆహా వీడియో లో రిలీజ్ అయిన వెబ్ సిరీస్ కుడి ఎడమైతే అంచనాలను మించే రేంజ్ లో అలరించి ది బెస్ట్ అనిపించుకుందని చెప్పాలి.

స్టొరీ పాయింట్ మొత్తం అమలా పాల్ మరియు రాహుల్ విజయ్ ల చుట్టూ తిరుగుతుంది… ఒక కిడ్నాప్ అండ్ ఒక సూసైడ్ వలన వీళ్ళ లైఫ్ ఒక టైం లూప్ లో ఇరుక్కుంటుంది.. దాంతో ఒక రోజు పదే పదే రిపీట్ అవుతూ ఉంటుంది. అది వీళ్ళ ఇద్దరికీ తప్పితే…

మిగిలిన వాళ్లకి నార్మల్ గా ఉంటూ వస్తుండటం, వీళ్ళ ఇద్దరికీ కూడా పరిచయం లేక పోవడం తో కథ ఎటు నుండి ఎటు పోతుందో అన్న ఆసక్తి, ఫైనల్ గా వీళ్ళు టైం లూప్ నుండి బయట పడ్డారా లేరా అన్న ఇంట్రెస్ట్ తో కుడి ఎడమైతే లాస్ట్ వరకు మెప్పిస్తుంది.

రాహుల్ విజయ్ మరియు అమలా పాల్ ల పెర్ఫార్మెన్స్ బాగా మెప్పించాగా సిరీస్ మొదటి ఎపిసోడ్ కొంచం బోర్ లా అనిపించినా రెండో ఎపిసోడ్ నుండి జోరు మొదలు అవుతుంది. కిడ్నాప్ అండ్ సూసైడ్ ల క్యారెక్టర్స్ బ్యాగ్రౌండ్ తో వీళ్ళ టైం లూప్ ముడి పడి ఉండటం, ఇవన్నీ ఎలా వీళ్ళు సాల్వ్ చేశారు అన్నది ఆసక్తిగా సాగగా…

ఇక కథ ముగుస్తుందిలే అనుకుంటే క్లైమాక్స్ కొత్త ట్విస్ట్ తో మంచి ముగింపుని ఇచ్చారు. బ్యాగ్రౌండ్ స్కోర్ కూడా బాగా మెప్పిస్తుంది. మొత్తం మీద తెలుగు లో ఇప్పటి వరకు వచ్చిన వెబ్ సిరీస్ లలో ఇది బెస్ట్ గా నిలిచింది అని చెప్పొచ్చు. మీరు కూడా మీ ఫ్రీ టైం లో ఈ సిరీస్ ను చూసి మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి.

Leave a Comment