న్యూస్

కుమ్మేసిన రాధే శ్యామ్ ఫస్ట్ లుక్….ఫ్యాన్స్ కి పూనకాలే ఇక!!

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఇప్పుడు పాన్ ఇండియా స్టార్… ఇది వరకు తన సినిమాల కోసం రెండు తెలుగు రాష్ట్రాల ఆడియన్స్ మాత్రమె ఎదురు చూసే వాళ్ళు కానీ ఇప్పుడు టోటల్ ఇండియా వైడ్ ఆడియన్స్ ప్రభాస్ సినిమా కోసం ఆశగా ఎదురు చూస్తూ ఉంటారు. బాహుబలి సిరీస్ తర్వాత ప్రభాస్ చేసిన సాహో అట్టర్ డిసాస్టర్ టాక్ తో కూడా సెన్సేషనల్ రికార్డులను బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకుంది.

ఇక హిందీ లో అయితే డిసాస్టర్ టాక్ తోనే సూపర్ హిట్ అనిపించుకుంది ఈ సినిమా. అలాంటి క్రేజ్ ని సొంతం చేసుకున్న తర్వాత ప్రభాస్ నటిస్తున్న కొత్త సినిమా పై స్కై హై ఎక్స్ పెర్టేషన్స్ ఉండగా ఫస్ట్ లుక్ అండ్ టైటిల్ అనౌన్స్ మెంట్ ని ఈ మార్చ్ ఎండ్ టైం కే…

రిలీజ్ చేస్తామని ఊరించి ఊరించి ఎట్టకేలకు మరో 3 నెలకు పైగా టైం తీసుకుని ఇప్పుడు రిలీజ్ చేశారు. సినిమా కి ముందు అనుకున్న టైటిల్స్ లోనే టైటిల్ పెట్టడం విశేషం. ఫస్ట్ లుక్ లో టైటిల్ ఎంతబాగా ఆకట్టుకుందో ప్రభాస్ లుక్ అండ్ పూజా హెడ్గే కూడా…

అంతే బాగా ఆకట్టుకోవడం విశేషం అనే చెప్పాలి… ఇక ఫస్ట్ లుక్ చూసి ఫ్యాన్స్ ఇన్నాళ్ళ ఎదురు చూపులకు మంచి గిఫ్ట్ ఇచ్చారు అంటూ సోషల్ మీడియా లో ఎంజాయ్ చేస్తున్నారు. ఇక ఫస్ట్ లుక్ ట్రెండ్స్ లో బిగ్గెస్ట్ రికార్డ్ కొట్టడానికి కూడా ప్రిపేర్ అవుతున్నారు ఫ్యాన్స్. ఇక సినిమా షూటింగ్ చివరి స్టేజ్ లోనే ఉండగా…

కరోనా ఎఫెక్ట్ లేకుండా ఉంటే ఈ ఏడాదే వచ్చి ఉండేది కానీ ఇప్పుడు వచ్చే ఏడాది కి పోస్ట్ పోన్ అయిన విషయం తెలిసిందే, లేట్ అయినా కానీ బాక్స్ అఫీస్ దగ్గర రిలీజ్ అయినప్పుడు మళ్ళీ ప్రభాస్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఊరమాస్ రికార్డులను క్రియేట్ చేయడం మాత్రం పక్కా అని చెప్పాలి..

Leave a Comment