న్యూస్ బాక్స్ ఆఫీస్

కుమ్మేస్తున్న అడ్వాన్స్ బుకింగ్స్…ఫస్ట్ డే సాలిడ్ కలెక్షన్స్ పక్కా!!

థియేటర్స్ మూతబడి ఆల్ మోస్ట్ 8 నెలల తర్వాత రీసెంట్ గా చాలా చోట్లా తెరచినా కానీ కొత్త సినిమాలు ఏవి కూడా రిలీజ్ కాకపోవడం తో పాత సినిమాలను మళ్ళీ థియేటర్స్ లో వేయగా జనాలు పెద్దగా ఆసక్తి చూపలేదు, కానీ ఒక పెద్ద సినిమా రిలీజ్ అయితే జనాలు తిరిగి థియేటర్స్ కి వస్తారేమో అన్న ఆశ ఉన్న డేర్ చేయడానికి ఎవ్వరూ ముందుకు రాని టైం లో 2020 ఇయర్ లో…

హాలీవుడ్ మూవీస్ పరంగా మోస్ట్ వాంటెడ్ మూవీ అయిన క్రిస్టఫర్ నోలన్ డైరెక్షన్ లో వచ్చిన టెనెట్ మూవీ వరల్డ్ వైడ్ గా పరిస్థితులు బాగున్న దేశాల్లో రిలీజ్ అయ్యి పర్వాలేదు అనిపించే కలెక్షన్స్ ని సాధించగా ఇండియా లో అఫీషియల్ పాండమిక్ తర్వాత…

రిలీజ్ అవుతున్న పెద్ద సినిమాగా 4 న రిలీజ్ కానుండగా సినిమా అడ్వాన్స్ బుకింగ్ చాలా చోట్లా మొదలు అవ్వగా 50% ఆక్యుపెన్సీ కండీషన్ ఉన్నా కానీ బుకింగ్స్ మాత్రం బాగా జరుగుతున్నాయని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇండియా వైడ్ గా సుమారు ఈ సినిమా 2000 పైగానే థియేటర్స్ లో రిలీజ్ అవ్వడానికి సిద్ధం అవుతూ ఉండగా..

అడ్వాన్స్ బుకింగ్స్ మొత్తం మీద ఇప్పటి వరకు 40% వరకు జరిగాయి అని అంటున్నారు, ఈ లెక్కన రిలీజ్ రోజున బుకింగ్స్ సాలిడ్ గా ఇంప్రూవ్ మెంట్ ని సొంతం చేసుకునే అవకాశం కూడా ఉందని చెప్పాలి. ఇక ఈ బుకింగ్స్ ని చూసి సినిమా ఇండియా లో మొదటి రోజు అవలీలగా 5 కోట్ల రేంజ్ నెట్ కలెక్షన్స్ ని…

అందుకునే అవకాశం ఉందని ప్రిడిక్ట్ చేస్తుండటం విశేషం, ఇక తెలుగు రాష్ట్రాలలో సినిమా లిమిటెడ్ గానే రిలీజ్ కానుంది, ఆంధ్రప్రదేశ్ లో 50 థియేటర్స్ లో రిలీజ్ ను కన్ఫాం చేసుకోగా, నైజాం లో ప్రస్తుతానికి AMB థియేటర్ లో రిలీజ్ కానుండగా మిగిలిన థియేటర్స్ ఇంకా నిర్ణయం తీసుకోవాల్సి ఉంది, ఇక్కడ కూడా సినిమా కి మంచి ఓపెనింగ్స్ దక్కే అవకాశం ఉందని అంటున్నారు ఇప్పుడు.

Leave a Comment