గాసిప్స్ న్యూస్

కెరీర్ బిగ్గెస్ట్ హిట్ కొట్టాడు…అయినా ఈ రిస్క్ ఏంటి సామి!!

మాస్ మహారాజ్ రవితేజ బాక్స్ ఆఫీస్ దగ్గర వరుస ఫ్లాఫ్స్ లో ఉన్న టైం లో రీసెంట్ గా క్రాక్ మూవీ తో సెన్సేషనల్ కంబ్యాక్ ని సొంతం చేసుకున్నాడు, సినిమా మీద ఉన్న అపార నమ్మకంతో అనేక అవరోధాల నడుమ ఈ సినిమా ను బాక్స్ ఆఫీస్ దగ్గర సంక్రాంతి బరిలోకి దింపగా సినిమా బాక్స్ ఆఫీస్ ను షేక్ చేసి రవితేజ కెరీర్ లో బిగ్గెస్ట్ రికార్డులను నమోదు చేసింది.

అది కూడా సినిమా 50% ఆక్యుపెన్సీ తో సెన్సేషనల్ కలెక్షన్స్ ని సొంతం చేసుకున్న ఈ సినిమా తో రవితేజ సాలిడ్ కంబ్యాక్ ను సొంతం చేసుకోగా, ఇలా ఓ బ్లాక్ బస్టర్ కంబ్యాక్ ఇచ్చాడో లేదో మళ్ళీ రిస్క్ చేయడానికి సిద్ధం అవుతున్నాడు రవితేజ. తన లేటెస్ట్ మూవీ…

ఖిలాడీ అఫీషియల్ టీసర్ ను రీసెంట్ గా రిలీజ్ చేయగా థ్రిల్లర్ జానర్ లో రూపొందిన ఈ సినిమా టీసర్ కి రెస్పాన్స్ బాగానే సొంతం అయ్యింది, ఇక సినిమా పాత రిలీజ్ డేట్ నే ఇప్పుడు రాబోతుందని అంటున్నారు. ప్రస్తుతం సెకెండ్ వేవ్ పీక్ స్టేజ్ లో ఉన్న టైం లో….

అన్ని సినిమాలు రిలీజ్ డేట్స్ ని పోస్ట్ పోన్ చేసుకుంటూ వస్తున్నాయి. ఏప్రిల్ రిలీజ్ లు అన్నీ కూడా పోస్ట్ పోన్ అవ్వగా అవి మే లో వచ్చే అవకాశం ఉందని అంటున్నారు, దాంతో పాటు త్వరలోనే తెలుగు రాష్ట్రాలలో 50% ఆక్యుపెన్సీ పెట్టె అవకాశం ఉందని అంటూ ఉండటం తో అన్ని సినిమాలకు కలెక్షన్స్ పరంగా ఇబ్బందులు రావడం ఖాయం.. అయినా కానీ…

రవితేజ ఖిలాడీ అనుకున్న టైం కే సినిమాను థియేటర్స్ లో దింపాలని చూస్తున్నారట. ఆల్ రెడీ రవితేజ 50% ఆక్యుపెన్సీ తోనే కెరీర్ బెస్ట్ కొట్టాడు కాబట్టి మరోసారి రిస్క్ తీసుకోవడం పెద్ద కష్టమేమి కాదని అంటున్నారు. మరి ఇదే ఫైనల్ అవుతుందా లేక టీం నిర్ణయం మళ్ళీ మార్చుకుంటారా అన్నది ఈ సెకెండ్ వేవ్ ఎఫెక్ట్ రెండు వారాల్లో ఎలా ఉంటుంది అన్న దానిపై ఆధార పడి ఉంటుంది.

Leave a Comment