న్యూస్ బాక్స్ ఆఫీస్

కెరీర్ బిగ్గెస్ట్ హిట్ 8 రోజుల్లో ఔట్….8 డేస్ టోటల్ కలెక్షన్స్ ఇవి!!

అక్కినేని నాగ చైతన్య లేటెస్ట్ మూవీ మజిలీ బాక్స్ ఆఫీస్ దగ్గర జోరు ఏమాత్రం తగ్గించడం లేదు, రెండు తెలుగు రాష్ట్రాలలో సాలిడ్ కలెక్షన్స్ తో దూసుకు పోతున్న ఈ సినిమా మొదటి వారం లోనే బాక్స్ ఆఫీస్ దగ్గర ఏకంగా 28 కోట్లకు పైగా షేర్ ని అందుకుని సంచలనం సృష్టించగా సినిమా ఇప్పుడు రెండో వారం లో కొత్త సినిమా చిత్రలహరి నుండి పోటి ని ఎదురుకున్నా కానీ స్ట్రాంగ్ గా…

8 వ రోజు ని ముగించింది, సినిమా 8 వ రోజు రెండు రాష్ట్రాలలో 80 లక్షల నుండి 1 కోటి లోపు కలెక్షన్స్ వస్తాయని అంచనా వేయగా సినిమా టోటల్ గా 8 వ రోజు 91 లక్షల షేర్ ని బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకుంది, ఇక వరల్డ్ వైడ్ గా సినిమా 8 వ రోజు…

1.04 కోట్ల షేర్ ని అందుకుని మరోసారి సత్తా చాటుకుంది, దాంతో 8 రోజుల్లో రెండు తెలుగు రాష్ట్రాలలో మొత్తం మీద 23.11 కోట్ల షేర్ ని అందుకున్న మజిలీ సినిమా వరల్డ్ వైడ్ గా 8 రోజుల్లో 29.12 కోట్ల షేర్ మార్క్ ని అధిగమించి సత్తా చాటుకుంది. ఇక సినిమా టోటల్ గా…

47.5 కోట్ల రేంజ్ లో గ్రాస్ ని వరల్డ్ వైడ్ గా అందుకుందని సమాచారం. ప్రీ రిలీజ్ బిజినెస్ ని దాటి ఇప్పటికే 7 కోట్ల ప్రాఫిట్ తో సూపర్ హిట్ గా నిలిచిన ఈ సినిమా నాగ చైతన్య కెరీర్ లో నంబర్ 1 మూవీ గా నిలిచిన రారండోయ్ వేడుక చూద్దాం సినిమా 28.91 కోట్ల షేర్ కలెక్షన్స్ ని…

దాటేది ఇప్పుడు 8 రోజుల్లో నే నాగ చైతన్య కెరీర్ లో నంబర్ 1 మూవీ గా నిలిచి 30 కోట్ల షేర్ వైపు అడుగులు వేస్తూ దూసుకు పోతున్న ఈ సినిమా ఇప్పుడు లాంగ్ రన్ లో 40 కోట్ల మార్క్ ని అందుకునే టార్గెట్ తో దూసుకు పోతుంది అని చెప్పాలి. న్యూస్ అప్ డేట్స్ కోసం బెల్ ఐకాన్ ని ప్రెస్ చేసి సబ్ స్బైబ్ చేసుకోండి.. అప్ డేట్ రాగానే నోటిఫికేషన్ మీకు అందుతుంది.

Leave a Comment

Do NOT follow this link or you will be banned from the site!