న్యూస్

కెరీర్ లో ఫస్ట్ టైం స్టార్ హీరోతో శేఖర్ కమ్ముల మూవీ…హీరో ఎవరంటే!

టాలీవుడ్ లో సెన్సిబుల్ డైరెక్టర్ గా పేరున్న దర్శకుడు శేఖర్ కమ్ముల, కెరీర్ ని ఎప్పుడో మొదలు పెట్టినా కానీ చాలా సెలెక్టివ్ గానే సినిమాలు చేస్తూ ఎప్పుడూ కూడా స్టార్స్ జోలికి వెళ్ళకుండా సినిమాలను ప్లాన్ చేసే శేఖర్ కమ్ముల సినిమాలు అంటే ఆడియన్స్ కి చాలా ఇష్టమనే చెప్పాలి, ఆనంద్, గోదావరి, హ్యాపీడేస్, లీడర్, లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్, ఫిదా ఇలా చాలా తక్కువ సినిమాలనే కెరీర్ లో చేసినా కానీ…

ఎప్పటికీ గుర్తుండి పోయే సినిమాలను తెరకెక్కించారు శేఖర్ కమ్ముల, హిట్స్ అండ్ క్రేజ్ ఉన్నప్పటికీ కూడా ఎప్పుడూ స్టార్ హీరోల జోలికి వెళ్ళలేదు, ఇప్పుడు నాగ చైతన్య తో కలిసి లవ్ స్టొరీ సినిమా తీసిన శేఖర్ కమ్ముల ఈ సినిమా తర్వాత మాత్రం…

కెరీర్ లో ఇప్పటి వరకు లేని విధంగా ఓ స్టార్ హీరో తో ఏకంగా పాన్ ఇండియా మూవీ ని డైరెక్ట్ చేయబోతున్నాడు. ఆ హీరో మరెవరో కాదు, ప్రస్తుతం కోలివుడ్ లోనే కాదు ఇండియా లో కూడా మోస్ట్ వాంటెడ్ హీరోలలో ఒకరిగా నిలిచే ధనుష్ తో శేఖర్ కమ్ముల మూవీ…

అఫీషియల్ గా కన్ఫాం అయింది. నిన్న మొన్నటి వరకు కూడా వీళ్ళ కాంబినేషన్ పై ఎలాంటి న్యూస్ లు లాంటివి రాలేదు కానీ సడెన్ గా వీళ్ళ కాంబినేషన్ పై వార్తలు రావడం వెంటనే అఫీషియల్ గా రీసెంట్ గా అనౌన్స్ చేయడం జరిగింది. తెలుగు-తమిళ్ మరియు హిందీ లో ఈ సినిమా రూపొందబోతుందని కన్ఫాం చేశారు. సినిమా ను ఏసియన్ మూవీస్ వారు…

శ్రీ వెంకటేశ్వర LLP వారు కలిసి నిర్మించబోతున్నారు. సినిమా ను త్వరలోనే సెట్స్ పైకి తీసుకు వెళ్ళే అవకాశం కూడా ఉందని అంటున్నారు. కెరీర్ లో ఫస్ట్ టైం ఓ బిగ్ స్టార్ తో వర్క్ చేస్తున్న శేఖర్ కమ్ముల ఎలాంటి సినిమా చేస్తారు, పాన్ ఇండియా లెవల్ లో ఏ రేంజ్ లో ఆకట్టుకుంటారు అన్నది ఇప్పుడు ఆసక్తిగా మారింది.

Leave a Comment