టోటల్ కలెక్షన్స్ న్యూస్ బాక్స్ ఆఫీస్

కొండ పొలం కలెక్షన్స్: 8 కోట్ల టార్గెట్ కి….టోటల్ గా వచ్చింది ఇది!!

ఫస్ట్ మూవీ ఉప్పెన తో బాక్స్ ఆఫీస్ దగ్గర సెన్సేషనల్ హిట్ ని అందుకోవడమే కాదు ఇండియా లో కూడా డెబ్యూ మూవీ తో ఆల్ టైం రికార్డులను క్రియేట్ చేసిన హీరోగా నిలిచిన పంజా వైష్ణవ్ తేజ్ నటించిన రెండో సినిమా కొండ పొలం లాస్ట్ ఇయరే తక్కువ టైం లో షూటింగ్ ను పూర్తీ చేసుకుని డైరెక్ట్ గా డిజిటల్ రిలీజ్ అవుతుంది అనుకుంటే కొంచం లేట్ అవ్వడం, ఈ లోపు ఉప్పెన…

సంచలనం సృష్టించడంతో థియేటర్స్ లో రిలీజ్ చేయాలనీ వెయిట్ చేసి సినిమాను ఆడియన్స్ ముందుకు తీసుకు రాగా సినిమా కి పర్వాలేదు అనిపించే టాక్ ఆడియన్స్ నుండి వచ్చినా కానీ బాక్స్ ఆఫీస్ దగ్గర ఓపెనింగ్ రోజు నుండే ఏమాత్రం ఇంపాక్ట్ ని క్రియేట్ చేయలేక పోయిన ఈ సినిమా…

ఏ దశలో కూడా సినిమా బిజినెస్ ను అందుకునే రేంజ్ లో కలెక్షన్స్ ని సొంతం చేసుకోలేక పోయింది, దానికి తోడూ పోటి లో ఇతర సినిమాలు కూడా ఉండటం లాంటివి సినిమా కలెక్షన్స్ పై ఇంపాక్ట్ చూపి బాక్స్ ఆఫీస్ పరుగును రెండు వారాలకే ముగిసేలా చేసింది అని చెప్పాలి.

టోటల్ రన్ లో సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…
👉Nizam: 98L
👉Ceeded: 44L
👉UA: 65L
👉East: 36L
👉West: 27L
👉Guntur: 39L
👉Krishna: 30L
👉Nellore: 20L
AP-TG Total:- 3.59CR(5.66CR~ Gross)
Ka+ROI: 11L
OS – 20L
Total WW: 3.90CR(6.50CR~ Gross)
ఇదీ సినిమా టోటల్ రన్ లో సాధించిన కలెక్షన్స్ లెక్క…

సినిమాను మొత్తం మీద 7.5 కోట్ల రేటు కి అమ్మగా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 8 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగగా సినిమా టోటల్ రన్ లో సాధించిన కలెక్షన్స్ కాకుండా మొత్తం మీద 4.1 కోట్ల లాస్ ను సొంతం చేసుకుని బ్రేక్ ఈవెన్ లో సగం కూడా రికవరీ చేయలేక డబుల్ డిసాస్టర్ రేంజ్ ఫ్లాఫ్ గా పరుగును పూర్తీ చేసుకుంది ఈ సినిమా..

Leave a Comment