న్యూస్ బాక్స్ ఆఫీస్

కొత్తా లేదు పాత లేదు…క్రాక్ 14 వ రోజు కలెక్షన్స్…మిగిలిన సినిమాలు ఏవి దరిదాపుల్లో కూడా లేవు!!

బాక్స్ ఆఫీస్ దగ్గర ఎప్పుడైనా టాక్ కి అతీతంగా ఓపెనింగ్స్ రావొచ్చు కానీ లాంగ్ రన్ లో దుమ్ము లేపాలి అంటే ఆ సినిమాలకు పాజిటివ్ టాక్ అన్నది చాలా ముఖ్యం, ఇప్పుడు సంక్రాంతి బరిలో దుమ్ము లేపుతున్న రవితేజ క్రాక్ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ఇప్పుడు ఈ పాజిటివ్ టాక్ పవర్ తోనే దుమ్ము దుమారం చేస్తూ మిగిలిన సినిమాలను డామినేట్ చేస్తూ దూసుకు పోతుంది.

సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర రిలీజ్ అయ్యి 2 వారాలు అవుతుంది, మిగిలిన సినిమాలు అన్నీ పండగ రోజున రిలీజ్ ను సొంతం చేసుకుని వేటి రేంజ్ లో అవి ఓపెనింగ్స్ ని సొంతం చేసుకున్నాయి. రెండో వారం కూడా స్టడీ కలెక్షన్స్ ని సాధిస్తున్నాయి, కానీ వాటితో పోల్చితే….

వర్కింగ్ డేస్ లో క్రాక్ ప్రతీ రోజు హైయెస్ట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుంటూ దూసుకు పోతుంది, సినిమా 14 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో సాధించిన కలెక్షన్స్ పాత సినిమాలు కొత్త సినిమా కన్నా కూడా ఎక్కువ అవ్వడం విశేషం. 10 వ రోజులో ఉన్న రెడ్ మూవీ…

23 లక్షల షేర్ ని అందుకోగా 10 వ రోజు లోనే ఉన్న అల్లుడు అదుర్స్ 10 లక్షల షేర్ ని అందుకుంది, ఇక 11 వ రోజు లో ఉన్న మాస్టర్ 18 లక్షల షేర్ ని అందుకోగా మూడు సినిమాలు కలిపి 51 లక్షల షేర్ ని అందుకోగా క్రాక్ ఒక్కటే 14 వ రోజు ఏకంగా 83 లక్షల షేర్ ని వసూల్ చేసింది. ఇక కొత్త సినిమా బంగారు బుల్లోడు సినిమా కేవలం వర్త్ షేర్ ని చూసుకుంటే 46 లక్షల షేర్ ని…

సొంతం చేసుకోగా హైర్స్ తో కలిపి 67 లక్షల షేర్ ని సొంతం చేసుకుంది, అయినా కానీ క్రాక్ కన్నా తక్కువ కలెక్షన్స్ మొదటి రోజు వచ్చాయి. బాక్స్ ఆఫీస్ దగ్గర పాజిటివ్ టాక్ పవర్ తో రెండో వారం వర్కింగ్ డేస్ లో మిగిలిన సినిమాలు అన్నింటిని డామినేట్ చేస్తూ దూసుకుపోతున్న క్రాక్ ఇప్పుడు వీకెండ్ అండ్ 26వ తారీఖులో మరింత రచ్చ చేయడం ఖయామని చెప్పొచ్చు.

Leave a Comment