న్యూస్ స్పెషల్

కొత్త హీరోయిన్ కి NTR ఫ్యాన్స్ గిఫ్ట్!!….నేషనల్ వైడ్ ట్రెండ్ తో రికార్డ్!!

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ సోషల్ మీడియా లో దుమ్ము దులిపెశారు, ఎన్టీఆర్ నటించిన సినిమాలు ఏవి ఈ ఇయర్ లేక పోవడం తో ఎలాంటి అప్ డేట్స్ లేక ఎదురు చూపులు చూస్తున్న తరుణంలో RRR టీం నుండి సడెన్ సర్ప్రైజ్ గా సినిమా షూటింగ్ గురించి అలాగే ఎన్టీఆర్ పక్కన హీరోయిన్ గురించిన న్యూస్ లు రిలీజ్ అవ్వడం తో సోషల్ మీడియాలో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఫుల్ యాక్టివ్ అయ్యారు.

సినిమా లో ఎన్టీఆర్ పక్కన హీరోయిన్ గా బ్రిటిష్ నటి ఓవిలియా మోరిస్ ని ఎంచుకున్నామని అప్ డేట్ ఇవ్వడం తో ఫ్యాన్స్ ఓ రేంజ్ లో రెచ్చి పోయి సోషల్ మీడియాలో కొత్త హీరోయిన్ కోసం ట్రెండ్ చేయడం మొదలు పెట్టారు. అప్ డేట్ పెట్టి మరో అప్ డేట్ రావడానికి సమయం పట్టగా…

ఈ గ్యాప్ లోనే RRR సినిమా మీద వివిధ యాష్ టాగ్స్ తో 2 లక్షలకు పైగా ట్వీట్స్ ని అప్పటికే పోల్ చేసిన ఫ్యాన్స్ హీరోయిన్స్ అనౌన్స్ మెంట్ తర్వాత 70 వేలకి పైగా ట్వీట్స్ ని పోల్ చేశారు. ఇక వివిధ ట్వీట్స్ అన్నీ కలిపి 3 లక్షల రేంజ్ లో ట్వీట్స్ పోల్ అయినట్లు సమాచారం.

లాంచ్ అవుతున్న హీరోయిన్ పై ఈ రేంజ్ లో ట్వీట్స్ పడటం నేషనల్ వైడ్ ట్రెండ్ అవ్వడం ఇదే తొలిసారి అని చెప్పొచ్చు. ఇక సినిమాలో లీడ్ విలన్స్ రోల్స్ లో రే స్టీవెన్ సన్, మరియు అలిసన్ డూడీ నటించబోతున్నారు. మొత్తం మీద సినిమా షూటింగ్ ఇప్పటి వరకు 70% కంప్లీట్ అయిందని జక్కన్న తెలియజేశారు.

ఇక హీరోయిన్ ఎవరో తెలియడం తో సోషల్ మీడియాలో ఆమెని ఫాలో అవ్వడం మొదలు పెట్టిన ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆమె కి ఇప్పటి నుండే ఫ్యాన్స్ పవర్ ఎలా ఉంటుందో చూపిస్తున్నారు. ట్విట్టర్ లో 500 కూడా లేనీ ఫాలోవర్స్ ఇప్పుడు 15 వేలు దాటగా ఇంస్ట్రాగ్రామ్ లో 25 వేలకి పైగా ఫాలోవర్స్ ని ఒక్క రోజు లోపే సొంతం చేసుకుంది.

Leave a Comment