న్యూస్

కొన్ని గంటల్లో మెగాస్టార్ సునామీ!!

ఖైదీ నంబర్ 150 లాంటి రికార్డ్ బ్రేకింగ్ కం బ్యాక్ మూవీ తర్వాత మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న లేటెస్ట్ మూవీ సైరా నర సింహా రెడ్డి, భారీ అంచనాల నడుమ రూపొందుతున్న ఈ సెన్సేషనల్ మూవీ రెండేళ్ళు గా షూటింగ్ జరుపుకుంటూ ఉండగా ఎట్టకేలకు సినిమా అక్టోబర్ 2 న రావడానికి సిద్ధం అవుతుంది, ఇక సినిమా స్వాతంత్ర్య దినోత్సవం కానుకగా ఒక స్పెషల్ వీడియో ను ఈ రోజు కొన్ని గంటల్లో రిలీజ్ చేయబోతున్నారు.

సెట్స్ లో చిత్రీకరించిన కొన్ని కీలక సన్నివేశాల మేకింగ్ వీడియోలను కలిపి ఒక మేకింగ్ వీడియో ని నేడు మధ్యాహ్నం 3 గంటల 45 నిమిషాలకు రిలీజ్ చేయబోతున్నట్లు సమచారం, అందులో మెగాస్టార్ లుక్ స్పెషల్ గా ఉంటుందని టాక్ నడుస్తుంది.

అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు నేటి నుండి అఫీషియల్ గా మొదలు అయినట్లే అని అంటున్నారు, ఇక సినిమా కి సంభందించిన పాటల అప్ డేట్స్, కొత్త పోస్టర్ల ను ఒక్కొటిగా రిలీజ్ చేస్తూ సెప్టెంబర్ రెండో వారం లో సినిమా ఆడియో వేడుక ని…

ఘనంగా జరపాలని ప్లాన్ చేస్తున్నారు, ఈ ఇయర్ సెకెండ్ ఆఫ్ లో రాబోతున్న బిగ్గెస్ట్ మూవీస్ లో సైరా కూడా ఒకటి కాబట్టి సినిమా ఏమాత్రం పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకున్నా కానీ బాక్స్ ఆఫీస్ దగ్గర రికార్డ్ బ్రేకింగ్ కలెక్షన్స్ తో ఊచకోత కోయడం ఖాయమని చెప్పొచ్చు.

ఇక సినిమా బిజినెస్ విషయం లో కూడా జోరు అందుకోగా ఇప్పటికే కొన్ని ఏరియాల్లో రికార్డ్ బ్రేకింగ్ బిజినెస్ జరుగుతున్నట్లు సమాచారం, త్వరలోనే ఒక్కో ఏరియా ల వారిగా  బిజినెస్ కూడా రివీల్ కానుంది. ముందుగా ఈ రోజు మెగాస్టార్ ఎలాంటి సునామీ సృష్టిస్తాడో చూడాలి, న్యూస్ అప్ డేట్స్ కోసం బెల్ ఐకాన్ ని ప్రెస్ చేసి సబ్ స్బైబ్ చేసుకోండి.. అప్ డేట్ రాగానే నోటిఫికేషన్ మీకు అందుతుంది.

Leave a Comment

Do NOT follow this link or you will be banned from the site!