న్యూస్ బాక్స్ ఆఫీస్

కొబ్బరిమట్ట 4 డేస్ టోటల్ కలెక్షన్స్…సంపూ జయభేరి!

సంపూర్నేష్ బాబు హీరో గా తెరకెక్కిన లేటెస్ట్ మూవీ కొబ్బరి మట్ట బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి వీకెండ్ 2 రోజుల్ లోనే మంచి వసూళ్ళని సాధించ గా బాక్స్ ఆఫీస్ దగ్గర సోమవారం బక్రీద్ హాలిడే దొరకడం తో మరోసారి మంచి వసూళ్ళ ని అందుకుని మొత్తంగా 3 రోజుల్లో 1.9 కోట్ల రేంజ్ లో షేర్ ని బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకోగా 4 వ రోజు తొలి వర్కింగ్ డే టెస్ట్ ను ఎదురుకున్న సినిమా…

మంచి వసూళ్ళ తోనే రోజుని ముగించింది. సినిమా 4 వ రోజున రెండు తెలుగు రాష్ట్రాలలో 30 నుండి 35 లక్షల దాకా షేర్ ని మరోసారి అందుకుంటుంది అనుకున్నా మొత్తం మీద 28 లక్షల షేర్ ని అందుకుంది, ఇక వరల్డ్ వైడ్ గా 30 లక్షల దాకా షేర్ ని సాధించింది.

దాంతో టోటల్ గా 4 రోజులకు గాను బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా రెండు తెలుగు రాష్ట్రాలలో 1.99 కోట్ల షేర్ మార్క్ ని అందుకోగా వరల్డ్ వైడ్ గా 2.23 కోట్ల దాకా షేర్ ని సాధించింది, టోటల్ గ్రాస్ 3.9 కోట్ల వరకు వచ్చిందని సమాచారం. దాంతో బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా…

ఓవరాల్ గా జరిగిన బిజినెస్ ను క్రాస్ చేసింది, బిజినెస్ 2 కోట్ల రేంజ్ లో జరగగా సినిమా 2.5 కోట్ల రేంజ్ టార్గెట్ తో బరిలోకి దిగింది, కాగా 4 రోజుల్లో ఇప్పుడు 2.23 కోట్ల షేర్ తో సినిమా బిజినెస్ ని క్రాస్ చేసి మైనర్ ప్రాఫిట్స్ తో రన్ ని కొనసాగిస్తుంది అని చెప్పాలి.

ఇక 5 వ రోజు సాధించే వసూళ్ళ తో కానీ 6 వ రోజు వసూళ్ళ తో కానీ సినిమా పూర్తి బ్రేక్ ఈవెన్ ని కంప్లీట్ చేసుకోబోతుంది, దాంతో బాక్స్ ఆఫీస్ దగ్గర సంపూ ఖాతాలో చాలా కాలానికి హిట్ అయిన సినిమా గా జయభేరి ని మ్రోగించ బోతుంది కొబ్బరి మట్ట సినిమా. న్యూస్ అప్ డేట్స్ కోసం బెల్ ఐకాన్ ని ప్రెస్ చేసి సబ్ స్బైబ్ చేసుకోండి.. అప్ డేట్ రాగానే నోటిఫికేషన్ మీకు అందుతుంది.

Leave a Comment

Do NOT follow this link or you will be banned from the site!