న్యూస్ బాక్స్ ఆఫీస్

కొబ్బరి మట్ట కలెక్షన్స్: 2 కోట్లకు అమ్మితే 11 రోజుల్లో వచ్చింది ఇది!!

హృదయ కాలేయం తర్వాత మళ్ళీ హిట్ కోసం ఎదురు చూస్తున్న బర్నింగ్ స్టార్ సంపూర్నేష్ బాబు మళ్ళీ హృదయ కాలేయం టీం తో కలిసి చేసిన లేటెస్ట్ మూవీ కొబ్బరి మట్ట బాక్స్ ఆఫీస్ దగ్గర రీసెంట్ గా రిలీజ్ అయ్యి పర్వాలేదు అనిపించే టాక్ ని సొంతం చేసుకోగా ఇలాంటి స్పూఫ్ సినిమాలను ఇష్టపడే ఆడియన్స్ అండ తో సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి కలెక్షన్స్ నే సాధించింది అని చెప్పాలి.

సినిమా మొత్తం మీద బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి వారం మంచి వసూళ్ళనే సాధించినప్పటికీ రెండో వారం లో కొత్త సినిమాలు ఎక్కువగా రిలీజ్ అవ్వడం తో సినిమా స్లో డౌన్ అయ్యింది, దానికి తోడూ థియేటర్స్ కౌంట్ కూడా తగ్గుతూ వచ్చింది. మొత్తం మీద సినిమా…

11 రోజులు పూర్తి అయ్యే సరికి రెండు తెలుగు రాష్ట్రాలలో 2.97 కోట్ల షేర్ మార్క్ ని అందుకుంది, ఇక వరల్డ్ వైడ్ గా 3.18 కోట్ల షేర్ ని అందుకుంది ఈ సినిమా, 11 వ రోజున మొత్తం మీద 5 లక్షల రేంజ్ లోనే షేర్ ని అందుకోవడం తో త్వరలోనే పరుగును ఆపే అవకాశం ఎక్కువగా ఉంది.

కానీ ఉన్నంతలో సినిమా సాధించిన బిజినెస్ 2 కోట్లకు బాక్స్ ఆఫీస్ దగ్గర 2.5 కోట్ల రేంజ్ టార్గెట్ ని ఇప్పటికే క్రాస్ చేసి 68 లక్షల షేర్ ప్రాఫిట్ ని సొంతం చేసుకుని క్లీన్ హిట్ గా నిలిచిన కొబ్బరి మట్ట సినిమా 5 ఏళ్ల కి సంపూ ఖాతాలో క్లీన్ హిట్ గా నిలిచిన సినిమాగా మారింది.

ఇక సినిమా లాంగ్ రన్ లో మొత్తం మీద 3.5 కోట్ల లోపు షేర్ తో పరుగును ఆపే అవకాశం ఎక్కువగా ఉందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. మరి అంతకి మించి ముందుకు వెళ్ళాలి అంటే సినిమా మరింత జోరు చూపెట్టాల్సి ఉంటుంది. న్యూస్ అప్ డేట్స్ కోసం బెల్ ఐకాన్ ని ప్రెస్ చేసి సబ్ స్బైబ్ చేసుకోండి.. అప్ డేట్ రాగానే నోటిఫికేషన్ మీకు అందుతుంది.

Leave a Comment

Do NOT follow this link or you will be banned from the site!