న్యూస్ బాక్స్ ఆఫీస్

కొబ్బరి మట్ట ఫస్ట్ డే కలెక్షన్స్…దంచికొట్టాడు!!

సంపూర్నేష్ బాబు హీరోగా తెరకెక్కిన లేటెస్ట్ మూవీ కొబ్బరి మట్ట బాక్స్ ఆఫీస్ దగ్గర రీసెంట్ గా రిలీజ్ అయ్యింది, కాగా సినిమా మొత్తం స్పూఫ్స్ తో నిండి పోవడం తో అలాంటి వి ఇష్టపడే వారు సినిమా ను బాగా ఎంజాయ్ చేస్తున్నారు, సామాన్య ప్రేక్షకులకు కూడా సినిమా నచ్చుతుండటం తో బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి రోజు కలెక్షన్స్ పరంగా సినిమా దుమ్ము లేపిందని చెప్పొచ్చు. చాలా ఏరియాల్లో…

హౌస్ ఫుల్ బోర్డ్స్ పడగా అన్ని సెంటర్స్ లో మంచి ఆక్యుపెన్సీ తో రన్ అయ్యింది, సినిమా బడ్జెట్ తక్కువే అవ్వగా సినిమాను మొత్తం మీద 2 కోట్ల రేంజ్ లో అమ్మారు, కాగా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మినిమమ్ 2.5 కోట్ల రేంజ్ టార్గెట్ తో బరిలోకి దిగగా…

మొదటి రోజు సినిమా రెండు తెలుగు రాష్ట్రాలలో 50 లక్షల నుండి 60 లక్షల దాకా వసూల్ చేసేలా కనిపిస్తుంది, ఆ నంబర్ చిన్నదే అయినా సినిమా బిజినెస్ దృశ్యా రిలీజ్ దృశ్యా మంచి ఓపెనింగ్స్ కిందే చెప్పాలి, టోటల్ గా ఫైనల్ రిపోర్ట్స్ తెలియాల్సి ఉండగా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ కూడా పూర్తిగా బాగుంటే…

సినిమా 60 లక్షల నుండి 70 లక్షల లోపు షేర్ ని కూడా అందుకునే అవకాశం ఉంటుంది, ఇక వరల్డ్ వైడ్ గా 80 లక్షల దాకా వసూళ్ళ ని సినిమా సాధించవచ్చు. కాగా సినిమా జోరు వీకెండ్ మొత్తం ఇలాగే కొనసాగితే కచ్చితంగా బ్రేక్ ఈవెన్ అవ్వడం ఏమాత్రం కష్టం కాదని చెప్పొచ్చు.

సినిమాలో సంపూ డైలాగ్స్ కి డాన్సుల కి కామెడి సీన్స్ కి మంచి అప్లాజ్ లభిస్తుంది, టాక్ కూడా బాగుండటం తో లాంగ్ రన్ లో సినిమా కి కచ్చితంగా హెల్ప్ అవ్వడం ఖాయమని చెప్పొచ్చు. ఇక మొదటి రోజు అఫీషియల్ కలెక్షన్స్ లెక్కలు ఎలా ఉంటాయో చూడాలి. న్యూస్ అప్ డేట్స్ కోసం బెల్ ఐకాన్ ని ప్రెస్ చేసి సబ్ స్బైబ్ చేసుకోండి.. అప్ డేట్ రాగానే నోటిఫికేషన్ మీకు అందుతుంది.

Leave a Comment

Do NOT follow this link or you will be banned from the site!