గాసిప్స్ న్యూస్

కోలివుడ్ తరుపున సెకెండ్ బిగ్గెస్ట్ బడ్జెట్ మూవీ “పొన్నియిన్ సెల్వన్” రిలీజ్ ఎప్పుడంటే!

బాహుబలి ఎప్పుడైతే రిలీజ్ అయ్యి ఆల్ ఇండియా రికార్డుల బెండు తీసిందో అప్పటి నుండి అలాంటి అద్బుతమైన సినిమాను చేయాలని ట్రై చేయని ఇండస్ట్రీ లేదనే చెప్పాలి. బాలీవుడ్ ఒక్కో అడుగు వేస్తున్నా ఏది కూడా అనుకున్న విధంగా అయితే జరగడం లేదు. ఇక కోలివుడ్ లో 2.0 సినిమా అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందించినా కానీ బాహుబలి దరిదాపుల్లోకి కూడా రాలేక పోయింది. కానీ వాళ్ళ ప్రయత్నాలు మాత్రం ఆగడం లేదు…

అప్పట్లో సుందర్ సి బిగ్గెస్ట్ బడ్జెట్ తో సంగమిత్ర అనే సినిమా ను అనౌన్స్ చేసినా మధ్యలోనే ఆ ఆలోచన ఆగిపోయింది. ఇక కోలివుడ్ సీనియర్ డైరెక్టర్ మణిరత్నం మాత్రం ఇన్నాళ్ళు ఓ బిగ్గెస్ట్ స్టొరీ ని సిద్ధం చేస్తూ ఉండగా రీసెంట్ గా ఆ సినిమాను అనౌన్స్ చేశాడు.

హిస్టరీలో జరిగిన సంఘటన నేపధ్యంలో పొన్నియన్ సెల్వన్ అనే భారీ బడ్జెట్ మూవీ ని తెరకెక్కించబోతున్నట్లు 2 భాగాలుగా ఈ సినిమా ఉండబోతున్నట్లు కన్ఫాం చేశారు మణిరత్నం, రీసెంట్ గా సినిమా టైటిల్ పోస్టర్ ని రిలీజ్ చేస్తూ సినిమా రిలీజ్ ఎప్పుడు కాబోతుందో అన్నది కూడా కన్ఫాం చేశారు.

ఈ ఎపిక్ మూవీ లోని ఫస్ట్ పార్ట్ 2022 లో రిలీజ్ కానుందని కన్ఫాం చేశారు. ఈ సినిమాలో ఎవరెవరు నటిస్తారు అన్నది ఇంకా అఫీషియల్ గా కన్ఫాం చేయలేదు కానీ, విక్రం, కార్తీ, జయం రవి లాంటి భారీ స్టార్ కాస్ట్ ఉంటుందని వార్తలు భారీగానే ప్రచారంలో ఉన్నాయి. ఇక ఈ సినిమా రెండు పార్టులు కలిపి ఏకంగా 500 కోట్ల భారీ బడ్జెట్ ని పెట్టబోతున్నారని అంటున్నారు.

కోలివుడ్ తరుపున ఇది ఓవరాల్ గా రెండో హైయెస్ట్ బడ్జెట్ మూవీగా నిలవబోతుందని అంటున్నారు. 2.0 సినిమా 550 కోట్లకు పైగా బడ్జెట్ తో రూపొందిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ సినిమా సెకెండ్ బిగ్గెస్ట్ బడ్జెట్ మూవీ ఆఫ్ కోలివుడ్ గా నిలవబోతుంది. మరి ఈ సినిమా తో బాహుబలి రేంజ్ సక్సెస్ ను కోలివుడ్ సొంతం చేసుకుంటుందో లేదో అన్నది వచ్చే ఇయర్ తేలనుంది.

Leave a Comment