న్యూస్ బాక్స్ ఆఫీస్

క్రాకింగ్ బ్లాక్ బస్టర్: 17.5 కోట్ల టార్గెట్….2 వారాల్లో హ్యుమంగస్ ప్రాఫిట్!

మాస్ మహారాజ్ రవితేజ నటించిన లేటెస్ట్ మూవీ క్రాక్ బాక్స్ ఆఫీస్ దగ్గర సెన్సేషనల్ కలెక్షన్స్ తో ఇప్పుడు రెండు వారలను పూర్తీ చేసుకుంది, సినిమా మొదటి 5 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ ని పూర్తీ చేసుకోగా బాక్స్ ఆఫీస్ దగ్గర తర్వాత రెండో వారం వీకెండ్ లో జోరు చూపగా… వర్కింగ్ డేస్ లో స్లో అవుతుంది అనుకున్నా ఏమాత్రం స్లో అవ్వకుండా స్టడీ కలెక్షన్స్ ని సొంతం చేసుకుంటూ దూసుకు పోయిన…

క్రాక్ మొత్తం మీద ఇప్పుడు రెండు వారలను అద్బుతమైన కలెక్షన్స్ తో ముగించింది, సినిమా 14 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాలలో మరోసారి స్ట్రాంగ్ గా హోల్డ్ చేసి 83 లక్షల షేర్ ని సొంతం చేసుకుని దుమ్ము దుమారం చేసింది, వరల్డ్ వైడ్ గా 2 వారల కలెక్షన్స్ అప్ డేట్ అవ్వగా…

టోటల్ 2 వీక్స్ కి సినిమా సాధించిన టోటల్ కలెక్షన్స్ లెక్క ఈ విధంగా ఉంది…
👉Nizam: 9.72Cr
👉Ceeded: 5.30Cr
👉UA: 3.67Cr
👉East: 2.88Cr
👉West: 2.14Cr
👉Guntur: 2.36Cr
👉Krishna: 2Cr
👉Nellore: 1.54Cr
AP-TG Total:- 29.61CR (49.35Cr Gross~)
KA+ROI: 1.52Cr(Updated)
OS: 72L (Updated)
Total: 31.85Cr(53Cr~ Gross) (Updated)
ఇదీ 2 వారాల్లో క్రాక్ సాధించిన కలెక్షన్స్….

మొత్తం మీద 14 రోజుల్లో సెన్సేషనల్ కలెక్షన్స్ తో క్రాకింగ్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన క్రాక్ సినిమా రవితేజ కెరీర్ లో ఆల్ టైం బిగ్గెస్ట్ షేర్ ను అలాగే బిగ్గెస్ట్ గ్రాస్ ను వసూల్ చేసిన సినిమా గా సంచలనం సృష్టించింది. సినిమా టోటల్ ప్రీ రిలీజ్ బిజినెస్ 17 కోట్లు కాగా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 17.5 కోట్ల టార్గెట్ తో బరిలోకి దిగిన సినిమా మొత్తం మీద ఇప్పుడు 2 వారాల్లో బాక్స్ ఆఫీస్ దగ్గర…

14.35 కోట్ల ప్రాఫిట్ ను సొంతం చేసుకుని బ్లాక్ బస్టర్ విజయాన్ని నమోదు చేయగా ఇప్పుడు డబుల్ బ్లాక్ బస్టర్ గా నిలవడానికి సిద్ధం అవుతుంది ఈ సినిమా. ఇక 15 వ రోజు ఆదివారం అలాగే 17 వ రోజు గణతంత్ర దినోత్సవం హాలిడే సినిమాకి మరింత అడ్వాంటేజ్ గా నిలవబోతున్నాయి అని చెప్పపాలి..

Leave a Comment