గాసిప్స్ న్యూస్

క్రేజీ న్యూస్…ఫ్యాన్స్ థ్రిల్ అయ్యారు…కానీ!!

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ అరవింద సమేత వీర రాఘవ సినిమా తర్వాత పూర్తీ టైం ని ఇప్పుడు రాజమౌళి డైరెక్షన్ లో రామ్ చరణ్ తో కలిసి చేస్తున్న ఆర్ ఆర్ ఆర్ కోసమే కేటాయించగా ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ ఎలాంటి సినిమాలతో ఆడియన్స్ ను పలకరిస్తాడు అన్నది ఆసక్తిగా మారగా ఎన్టీఆర్ లైనప్ ఆఫ్ మూవీస్ అయితే సాలిడ్ గా ఉన్నాయి అనే చెప్పాలి. ముందు త్రివిక్రమ్ తో ఒక సినిమాను…

తర్వాత ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో మరో సినిమా సినిమా చేస్తున్న ఎన్టీఆర్ ఈ సినిమా తర్వాత కోలివుడ్ టాప్ డైరెక్టర్స్ లో ఒకరైన అట్లీ డైరెక్షన్ లో సినిమా ఉంటుంది, ఇక తర్వాత కొరటాల శివ డైరెక్షన్ లో సినిమా ఉంటుంది అని టాక్ ఉంది. కానీ ఇక వేటితో పాటు…

ఇప్పుడు ఎన్టీఆర్ అప్ కమింగ్ మూవీ లో మరో మూవీ చేరింది అంటూ సోషల్ మీడియా లో క్రేజీ రూమర్ ఒకటి చెక్కర్లు కొడుతుంది. ఆ న్యూస్ ప్రకారం ఎన్టీఆర్ అప్ కమింగ్ మూవీస్ లో ఒకటి ఏకంగా హాలీవుడ్ డైరెక్టర్ తో సినిమా ఉండబోతుంది అంటూ టాక్ చక్కర్లు కొడుతుంది…

వివరాల్లోకి వెళితే… హాలీవుడ్ డైరెక్టర్ నైట్ శ్యామలం తో ఎన్టీఆర్ మూవీ ఉండబోతుంది అంటున్నారు. ఈయన ఇది వరకు అక్కడ సిక్స్ సెన్స్, ఆఫ్టర్ ఎర్త్, స్ప్లిట్, అన్ బ్రేకబుల్ లాంటి మూవీస్ తీశారు, ఈయన ఎన్టీఆర్ తో అప్ కమింగ్ ప్రాజెక్ట్ లో ఒకటి చేస్తున్నారు అంటూ క్రేజీ రూమర్ చక్కర్లు కొడుతుంది కానీ ఇది కేవలం రూమర్ మాత్రమే అని చాలా వరకు కన్ఫాం న్యూస్ ఉంది…

ఇలాంటి ప్రాజెక్ట్ ఏది కూడా నిజం కాదని చెబుతున్నారు… కానీ పూర్తిగా తప్పు అని మాత్రం ఇంకా చెప్పలేదు. కానీ చాలా వరకు ఇది రూమర్ అనే చెప్పాలి. అప్ కమింగ్ ఎన్టీఆర్ మూవీస్ పాన్ ఇండియా లెవల్ లో ఉండబోతున్న విషయం తెలిసిందే. హాలీవుడ్ డైరెక్టర్ ఏమో కానీ బాలీవుడ్ డైరెక్టర్స్ ఒకరిద్దరు కథలు చెప్పి వెళ్ళినట్లు టాక్ ఉంది. వాటిపై కూడా పూర్తీ వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది…

Leave a Comment