గాసిప్స్ న్యూస్

ఖైదీ-మాస్టర్ డైరెక్టర్ తో టాలీవుడ్ టాప్ హీరోలలో ఒకరు!

లాస్ట్ ఇయర్ సైలెంట్ గా రిలీజ్ బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకున్న సినిమా ఖైదీ… కార్తీకి తెలుగు లో మార్కెట్ ఉన్నా కానీ చాలా సైలెంట్ గా వచ్చిన ఈ సినిమా మౌత్ టాక్ తో బ్లాక్ బస్టర్ హిట్ అవ్వగా ఈ సినిమా తీసిన డైరెక్టర్ లోకేష్ కనగారాజ్ తన తర్వాత సినిమా ను ఏకంగా కోలివుడ్ టాప్ హీరో అయిన ఇలయ దళపతి విజయ్ తో…

కమిట్ అవ్వగా వెను వెంటనే సినిమా ను మొదలు పెట్టడం పూర్తీ చేయడం చేసిన ఈ డైరెక్టర్ తక్కువ టైం లోనే సినిమా పై సాలిడ్ క్రేజ్ తీసుకు రావడం తో తన వంతు పాత్ర పోషించాడు. మాస్టర్ ఆన్నీ అనుకున్నట్లు జరిగితే సమ్మర్ కానుకగా…

తమిళ్ తెలుగు లో అత్యంత భారీ ఎత్తున రిలీజ్ అయ్యి ఉండేది కానీ కరోనా ఎఫెక్ట్ తో ఇప్పుడు ఇయర్ ఎండ్ కి పోస్ట్ పోన్ అయింది. ఇక ఈ రెండు మూవీస్ తర్వాత లోకేష్ ఖైదీ 2 తీయాల్సి ఉండగా దానికన్నా ముందు ఇప్పుడు తెలుగు లో ఒక సినిమా చేయబోతున్నాడు అని సమాచారం.

టాలీవుడ్ లీడింగ్ ప్రొడక్షన్ హౌసెస్ లో ఒకటైన మైత్రి మూవీ మేకర్స్ వారు లోకేష్ తో ఒక తెలుగు తమిళ్ బైలింగువల్ ని కమిట్ అయ్యారని అంటున్నారు. అది ఎవరితో అన్నది ఇంకా కన్ఫాం అవ్వాల్సి ఉండగా టాలీవుడ్ టాప్ హీరోలలో ఒకరితో సినిమా ఉండటం ఖాయంగా కనిపిస్తుంది. టాలీవుడ్ లో లేటెస్ట్ గా వినిపిస్తున్న రూమర్స్ ప్రకారం…

మైత్రి మూవీ మేకర్స్ సూపర్ స్టార్ మహేష్ బాబు లేదా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ లలో ఒకరితో ఈ సినిమా చేసే ఆలోచనలో ఉన్నారని టాక్ ఉంది. మరి ఇది ఎంతవరకు నిజం అవుతుందో ఎవరు కన్ఫాం అవుతారో అన్నది తెలియాల్సి ఉంది.త్వరలోనే దీనిపై న్యూస్ రావొచ్చని అంటున్నారు.

Leave a Comment