గాసిప్స్ న్యూస్

గంటకి లక్ష తీసుకునే బ్రహ్మానందం….జాతిరత్నాలు మూవీ రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?

కామెడీ బ్రహ్మ… బ్రహ్మానందం ప్రతీ రోజు మీమ్స్ రూపం లో సోషల్ మీడియా లో దర్శనం ఇస్తూనే ఉంటారు, ఆయన లేని సినిమాలు చాలా తక్కువ, రీసెంట్ టైం లో కొంచం గ్యాప్ తీసుకుని మళ్ళీ జోరు పెంచడానికి సిద్ధం అవుతున్న బ్రహ్మీ టాలీవుడ్ లో నే హైయెస్ట్ పెయిడ్ కమెడియన్ అన్న విషయం అందరికీ తెలిసిందే. ప్రతీ రోజు 10 గంటలు పనిచేసే అలవాటు ఉన్న బ్రహ్మీ… డిమాండ్ ఎంత ఉన్న కానీ అందరికీ…

అందుబాటులో ఉండేలా గంటకి లక్ష రెమ్యునరేషన్ తీసుకుని రోజుకి 10 గంటలు పని చేసేవారు… అలా అనేక సినిమాల్లో మారుతూ మారుతూ కామెడీ ని పండించే బ్రహ్మీ…. తర్వాత కొంచం హెల్త్ మీద దృష్టి పెట్టి రోజుకి ఒకటే షూటింగ్ లో పాల్గొనడం మొదలు పెట్టగా…

రోజుకి 5 లక్షల చొప్పున రెమ్యునరేషన్ తీసుకున్నారు కొంతకాలం… ఇది కూడా కొంత కాలం ఫుల్ బిజీగానే గడవగా… రీసెంట్ గా హెల్త్ ప్రాబ్లంస్ వలన సినిమాల్లో కొంచం గ్యాప్ ఇచ్చిన బ్రహ్మానందం. మళ్ళీ కొంచం ఎక్కువ లెంత్ ఉన్న పాత్రను రీసెంట్ గా జాతిరత్నాలు సినిమాలో చేసిన విషయం అందరికీ తెలిసిందే.

ఆల్ మోస్ట్ ఇది బ్రహ్మీ కంబ్యాక్ మూవీ గా చెప్పుకోవచ్చు. సిల్వర్ స్క్రీన్ పై కొంత గ్యాప్ తర్వాత మళ్ళీ ఈ సినిమాతో ఉన్నది తక్కువే స్క్రీన్ స్పేస్ అయినా మళ్ళీ నవ్వించారు బ్రహ్మానందం. ఇక ఈ సినిమా కి గాను మొత్తం మీద 5 రోజుల కాల్ షీట్స్ ఇచ్చిన బ్రహ్మీ మొత్తం మీద 5 రోజుల కి గాను కేవలం…

5 లక్షల రెమ్యునరేషన్ ని మాత్రమే తీసుకున్నారని టాలీవుడ్ లో ట్రేడ్ టాక్. వేరే కమెడియన్స్ అందరూ ప్రస్తుతం జోరుమీదున్నా కానీ బ్రహ్మీ టైమింగ్ ఎవరికీ సాధ్యం కాదన్న విషయం అందరికీ తెలిసిందే. గ్యాప్ తర్వాత చేసిన సినిమా అవ్వడం అది కూడా చిన్న సినిమా అవ్వడం తో తక్కువ రెమ్యునరేషన్ అయినా ఒప్పుకున్నారట. త్వరలోనే మళ్ళీ బిగ్ స్టార్ మూవీస్ లో తన కామెడీ తో బ్రహ్మానందం మళ్ళీ ఓ రేంజ్ లో నవ్వించడానికి సిద్ధం అవుతున్నారని తెలుస్తుంది.

Leave a Comment