న్యూస్ బాక్స్ ఆఫీస్

గంటలో బాలయ్య భీభత్సం…కాచుకోండి ఇక!!

నటసింహం నందమూరి బాలకృష్ణ ఈ ఏడాది ముచ్చటగా మూడో సారి ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధం అవుతున్నాడు, ఇయర్ మొదట్లో రెండు సార్లు ప్రేక్షకులను పలకరించిన బాలయ్య రెండు సార్లు కూడా అనుకున్న అంచనాలను అందుకోలేక పోయాడు. ముఖ్యంగా ఎన్టీఆర్ బయోపిక్ సిరీస్ లోని 2 పార్టులు కూడా మంచి టాక్ నే సొంతం చేసుకున్నా కానీ భారీ డిసాస్టర్ సినిమాలు గా నిలవడం అందరికీ ఓ రేంజ్ లో షాక్ ఇవ్వగా తర్వాత…

బాలయ్య ఇప్పుడు ప్రేక్షకులను తన కి నచ్చిన మాస్ జానర్ లో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ రూలర్ తో రాబోతున్నాడు. రూలర్ డైరెక్టర్ కే ఎస్ రవికుమార్ ఇది వరకే జై సింహా తో మంచి విజయాన్ని బాలయ్య కి అందివ్వడంతో ఫ్యాన్స్ కూడా ఈ సారి కూడా హిట్ కొట్టడం ఖాయమని.

కంబ్యాక్ ఇవ్వడం కూడా ఖాయమని విశ్వసిస్తున్నారు. ఇక రూలర్ సినిమా అఫీషియల్ టీసర్ మరో గంటలో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధం అవుతుంది. ఈ రోజు సాయంత్రం 4 గంటల 28 నిమిషాలకు సినిమా అఫీషియల్ టీసర్ ని రిలీజ్ చేయబోతున్నారు. యూనిట్ నుండి అందుతున్న సమాచారం ప్రకారం సినిమాలో కంటెంట్…

అటు మాస్ ని ఇటు క్లాస్ ని ఆకట్టుకునేలా ఉంటుందని, దానికి తోడూ బాలయ్య ఫ్యాన్స్ ని ఫుల్ సాటిస్ ఫై చేసేలా పోలిస్ రోల్ ఉంటుందని అంటున్నారు. మరో రోల్ అల్ట్రా స్టైలిష్ గా ఉండగా ఆ రోల్ లుక్ కి ఇప్పటికే అద్బుతమైన పాజిటివ్ రెస్పాన్స్ ఆడియన్స్ లో ఉండగా…

పోలిస్ లుక్ పై మాత్రం విమర్శలు వచ్చాయి. కానీ అవన్నీ పటాపంచలు చేసేలా సినిమా టీసర్ సినిమాకి మంచి బజ్ ని సొంతం చేస్తుందని యూనిట్ కాన్ఫిడెంట్ గా ఉంది, మరో గంటలో రిలీజ్ కానున్న అఫీషియల్ టీసర్ సీనియర్ హీరోల సినిమాల టీసర్ రికార్డులను ఎంతవరకు బ్రేక్ చేస్తుంది అన్నది ఇప్పుడు ఆసక్తిగా మారింది అని చెప్పాలి.

Leave a Comment

Do NOT follow this link or you will be banned from the site!