న్యూస్ వీడియో స్పెషల్

గంటలో 56 వేల ట్వీట్స్…ఇదేమి ట్రెండింగ్ సామి అసలు!!

స్టార్స్ అందు మెగాస్టార్ వేరయా అని అనేది ఇందుకే… మెగాస్టార్ చిరంజీవి నటించిన లేటెస్ట్ సెన్సేషన్ సైరా నర సింహా రెడ్డి రెండేళ్లుగా షూటింగ్ జరుపు కుంటున్న విషయం తెలిసిందే, అత్యంత భారీ ఎత్తున రూపొందుతున్న ఈ సెన్సేషనల్ మూవీ బాక్స్ ఆఫీస్ బరిలో అక్తోబర్ 2 న వీరంగం సృష్టించడానికి సిద్ధం అవుతుండ గా స్వాతంత్ర్య దినోత్సవం కానుక గా ఒకరోజు ముందు గా సినిమా కొత్త మేకింగ్ వీడియో ని రిలీజ్ చేశారు.

కాగా మేకింగ్ వీడియో లో బ్యాగ్రౌండ్ స్కోర్, అత్యంత భారీ సెట్స్, టాలీవుడ్, కోలివుడ్, బాలీవుడ్ శాండల్ వుడ్ ల హేమా హేమీల పాత్రల పరిచయం తో ఆకట్టుకోగా మేకింగ్ వీడియో చివర్లో మెగాస్టార్ ఎంట్రీ నుండి గూస్ బంప్స్ వచ్చాయని చెప్పొచ్చు.

ఇక మేకింగ్ వీడియో ని ఇలా రిలీజ్ చేశారో లేదో ఇండియా వైడ్ గా వరల్డ్ వైడ్ గా భారీ ఎత్తున ట్రెండ్ అవుతూ సంచలనం సృష్టించింది ఈ మేకింగ్ వీడియో.. రిలీజ్ అయిన 5 నిమిషాల లోపే ఇండియా లో 8 నిమిషాల లోపే వరల్డ్ వైడ్ గా ట్రెండ్ అవుతూ సంచలనం సృష్టించిన ఈ మేకింగ్ వీడియో…

ఒక గంట లోనే 56 వేల కి పైగా ట్వీట్స్ తో దుమ్ము లేపింది, #SyeRaaNarasimhaReddy, #SyeRaaMaking, #SyeRaaMakingVideo, #MegastarChiranjeevi ఇలా డిఫెరెంట్ ట్వీట్స్ మొత్తం మీద ఏకంగా 1 లక్ష రేంజ్ లో ట్వీట్స్ పడ్డాయి. అందులో గంట లోనే 56 వేల కి పైగా ట్వీట్స్ పడటం విశేషం.

సోషల్ మీడియా లో సీనియర్ హీరోల్లో ఇలా జస్ట్ మేకింగ్ వీడియో కే ఈ రేంజ్ లో రచ్చ జరగడం ఒక్క మెగాస్టార్ కే చెల్లింది, ఇక ఆగస్ట్ 20 న సినిమా మరో కొత్త టీసర్ ను రిలీజ్ చేయబోతున్నట్లు సమాచారం. ఆ టీసర్ మరో సారి సినిమా పై అంచనాలు పెంచేలా ఉంటే అక్టోబర్ 2 న రికార్డ్ లెవల్ ఓపెనింగ్స్ ఖాయమని చెప్పొచ్చు.

Leave a Comment