న్యూస్ స్పెషల్

గద్దలకొండ గణేష్ TRP రేటింగ్: అమ్మింది 7 కోట్లకు…వచ్చిన TRP రేటింగ్ ఇది!!

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ జోరు మీదున్నాడు, 2019 ఇయర్ లో ఎఫ్ 2 తో మల్టీ స్టారర్ బ్లాక్ బస్టర్ కొట్టేయగా ఇయర్ సెకెండ్ ఆఫ్ లో భారీ పోటి నడుమ వచ్చిన వాల్మీకి అలియాస్ గద్దల కొండ గణేష్ సినిమా బ్రేక్ ఈవెన్ ని పూర్తీ చేసుకుని హిట్ గా నిలిచింది. సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఫైనల్ రన్ లో 24.7 కోట్లకు పైగా షేర్ ని అందుకుని హిట్ అవ్వగా సినిమా ను…

స్టార్ మా ఛానెల్ ఏకంగా 7 కోట్ల రేటు చెల్లించి శాటిలైట్ రైట్స్ హక్కులను సొంతం చేసుకున్నారు. ఇక డిజిటల్ రైట్స్ హక్కులు 3 కోట్లకు హాట్ స్టార్ కొన్నారు. సినిమా టెలికాస్ట్ రీసెంట్ గా జరగగా ఓవరాల్ గా మొదటి సారి టెలికాస్ట్ అయినప్పుడు మంచి TRP రేటింగ్ ని సొంతం చేసుకుంది ఈ సినిమా.

సినిమా కి ఏకంగా 12.75 TRP రేటింగ్ ఫస్ట్ టైం టెలికాస్ట్ అయినపుడు దక్కడం విశేషం అనే చెప్పాలి. ఇదే సమయం లో టెలికాస్ట్ అయిన మెగాస్టార్ చిరంజీవి నటించిన లేటెస్ట్ మూవీ సైరా కి ఓవరాల్ గా 11.8 TRP రేటింగ్ మాత్రమె దక్కాగా ఈ సినిమా కి మాత్రం…

12.75 TRP రేటింగ్ దక్కి సాలిడ్ గా రేటింగ్ ని సొంతం చేసుకుని సంచనలం సృష్టించింది, రీసెంట్ టైం లో జెమినీ టీవీ లో కన్నా స్టార్ మా లి టెలికాస్ట్ అయ్యే సినిమాలకు చాలా బెటర్ TRP రేటింగ్ దక్కుతుంది, దానికి కారణాలు ఏంటి అనేవి క్లియర్ గా తెలియవు కానీ క్లారిటీ ఎక్కువ ఉండటం వలన కావచ్చు.

ఇక వరుణ్ తేజ్ వరుస సక్సెస్ ల తర్వాత ఇప్పుడు తన అప్ కమింగ్ మూవీ బాక్సింగ్ నేపధ్యం లో చేస్తున్నాడు, కాగా ఈ సినిమా ఈ ఇయర్ సమ్మర్ ఎండ్ లో కానీ లేక సెకెండ్ ఆఫ్ లో కానీ ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఎక్కువ అని తెలుస్తుంది… ఈ సినిమా హాట్రిక్ హిట్స్ ని కంప్లీట్ చేయాలని చూస్తున్నాడు వరుణ్ తేజ్..

Leave a Comment