న్యూస్ బాక్స్ ఆఫీస్

గల్లీ రౌడీ ఫస్ట్ డే కలెక్షన్స్ ఓపెనింగ్స్…ఈ హౌస్ ఫుల్స్ ఏంటి సామి!!

యంగ్ హీరో సందీప్ కిషన్ నటించిన లేటెస్ట్ మూవీ గల్లీ రౌడీ… బాక్స్ ఆఫీస్ దగ్గర ఆల్ మోస్ట్ 565 కి పైగా థియేటర్స్ లో వరల్డ్ వైడ్ గా గ్రాండ్ గా రిలీజ్ ను సొంతం చేసుకున్న ఈ సినిమా తెలుగు రాష్ట్రాలలో ఆల్ మోస్ట్ 460 కి పైగా థియేటర్స్ లో రిలీజ్ ను సొంతం చేసుకుంది. గ్రాండ్ రిలీజ్ ను మంచి పబ్లిసిటీ తో సొంతం చేసుకున్న ఈ సినిమా బాక్స్ ఆఫీస్ ఓపెనింగ్స్ విషయానికి వస్తే…

తొలిరోజు ఆంధ్ర రీజన్ లో సినిమాకి ఎవ్వరూ ఊహించని విధంగా హౌస్ ఫుల్ బోర్డులు పడ్డాయి… మంచి పబ్లిసిటీ చేసినప్పటికీ కూడా ఎంతైనా చిన్న సినిమానే కాబట్టి ఈ రేంజ్ లో ఫుల్స్ ఎవ్వరూ ఎక్స్ పెర్ట్ చేయలేదు అనే చెప్పాలి. ముఖ్యంగా వైజాగ్ ఏరియాలో అయితే…

80% కి పైగా షోలు అన్నీ ఫుల్స్ పడటం జరిగింది… ఇది నిజంగానే ఊచకోత అనే చెప్పాలి, ఇక మిగిలిన ఏరియాల్లో కూడా డీసెంట్ ఓపెనింగ్స్ ను సొంతం చేసుకున్న ఈ సినిమా నైజాం ఏరియాలో మట్టుకు 10-15% ఆక్యుపెన్సీ తోనే ఓపెన్ అవ్వగా ఈవినింగ్ అండ్ నైట్ షోల బుకింగ్స్…

పర్వాలేదు అనిపించే విధంగా కొనసాగుతూ ఉండగా మొత్తం మీద ఇప్పుడు సినిమా ఫుల్స్ అండ్ ఓవరాల్ ఆక్యుపెన్సీ ని గమనిస్తే బాక్స్ ఆఫీస్ దగ్గర 50 లక్షల రేంజ్ లో కలెక్షన్స్ ని సొంతం చేసుకునే అవకాశం ఎంతైనా ఉంది, ఎంత ఫుల్స్ పడినా కానీ ఆంధ్రల టికెట్ రేట్లు తక్కువగానే ఉండటం తో కలెక్షన్స్ అనుకున్న రేంజ్ లో అయితే రావనే చెప్పాలి.

ఓవరాల్ గా కంప్లీట్ ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు జోరు అందుకుంటే సినిమా ఫస్ట్ డే బాక్స్ ఆఫీస్ దగ్గర 60 నుండి 70 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకోవచ్చు… ఇంకా బుకింగ్స్ జోరు అందుకుంటే కలెక్షన్స్ పెరిగే ఛాన్స్ ఉంది… ఒకవేళ మొదటి రోజు 80 లక్షలకి పైగా కలెక్షన్స్ ని అందుకుంటే కచ్చితంగా సెన్సేషనల్ ఓపెనింగ్స్ ను సినిమా సొంతం చేసుకుందని చెప్పొచ్చు.

Leave a Comment