న్యూస్ బాక్స్ ఆఫీస్

గల్లీ రౌడీ 2 డేస్ కలెక్షన్స్…ఏంటి సామి ఇది!!

యంగ్ హీరో సందీప్ కిషన్ నటించిన లేటెస్ట్ మూవీ గల్లీ రౌడీ బాక్స్ ఆఫీస్ దగ్గర రీసెంట్ గా రిలీజ్ ను సొంతం చేసుకుంది, తెలుగు రాష్ట్రాలలో చాలా గ్రాండ్ గా సినిమా రిలీజ్ జరగగా సినిమా ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర సాలిడ్ ఓపెనింగ్స్ ను సొంతం చేసుకుంటుంది అనుకున్నా సినిమా నైజాం ఏరియాలో అండర్ పెర్ఫార్మ్ చేయగా ఆంధ్రలో టికెట్ రేట్లు తక్కువగా ఉండటం 50% ఆక్యుపెన్సీ వలన ఓవరాల్ గా…

ఫుల్స్ పడినా కానీ కలెక్షన్స్ మొదటి రోజు తక్కువగానే వచ్చాయి, కానీ సందీప్ కిషన్ రీసెంట్ ఫామ్ దృశ్యా పర్వాలేదు అనిపించే విధంగా 61 లక్షల రేంజ్ షేర్ ని మొదటి రోజు సొంతం చేసుకున్న గల్లీ రౌడీ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర రెండో రోజు కి వచ్చే సరికి…

గట్టి డ్రాప్స్ నే సొంతం చేసుకుంది, నార్మల్ గా మొదటి రోజు తో పోల్చితే రెండో రోజు డ్రాప్స్ కామనే కానీ ఈ సినిమా ఆల్ మోస్ట్ 50% రేంజ్ లో డ్రాప్స్ ను సొంతం చేసుకుంది, దాంతో బాక్స్ ఆఫీస్ బ్రేక్ ఈవెన్ పై ఇది గట్టి ఇంపాక్ట్ ని క్రియేట్ చేయోచ్చు.

రెండో రోజు సినిమా 33 లక్షల షేర్ ని మాత్రమె సొంతం చేసుకుంది. సినిమా 2 రోజుల టోటల్ కలెక్షన్స్ ని ఒకసారి గమనిస్తే…
👉Nizam: 29L
👉Ceeded: 17L
👉UA: 12L
👉East: 8L
👉West: 6L
👉Guntur: 10L
👉Krishna: 7L
👉Nellore: 5L
Total AP TG: 0.94CR(1.52CR~ Gross)
👉KA+ROI: 2L
👉OS: 1L~
TOTAL Collections: 0.97CR(1.60CR~ Gross)

సినిమాను మొత్తం మీద 2.75 కోట్ల రేంజ్ లో అమ్మగా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 3 కోట్ల రేంజ్ టార్గెట్ తో బరిలోకి దిగగా సినిమా 2 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ కాకుండా మరో 2.03 కోట్ల షేర్ ని సొంతం చేసుకోవాలి. మూడో రోజు ఆదివారం రెట్టించిన జోరు చూపెడితేనే బ్రేక్ ఈవెన్ ఛాన్స్ ఉంటుంది, మరి సినిమా ఎలా పెర్ఫార్మ్ చేస్తుందో చూడాలి.

Leave a Comment