న్యూస్ బాక్స్ ఆఫీస్

గల్లీ రౌడీ: 3 కోట్ల టార్గెట్…1st డే వచ్చింది ఇది..!!

యంగ్ హీరో సందీప్ కిషన్ నటించిన లేటెస్ట్ మూవీ గల్లీ రౌడీ బాక్స్ ఆఫీస్ దగ్గర రీసెంట్ గా భారే లెవల్ లో రిలీజ్ ను సొంతం చేసుకుంది, సినిమా ట్రైలర్ లాంచ్ తర్వాత కొంచం బజ్ ఏర్పడినా కానీ ఓవరాల్ గా సినిమా కి ప్రస్తుతం ఉన్న టైం లో 30 లక్షల రేంజ్ లో ఓపెనింగ్స్ రావొచ్చని రిలీజ్ కి ముందు అనుకున్నాం కానీ రిలీజ్ రోజున సినిమా కి ఆంధ్ర లో…

హౌస్ ఫుల్ బోర్డులు పడ్డాయి, నైజాం లో జస్ట్ యావరేజ్ అనిపించే రేంజ్ లో బుకింగ్స్ జరిగినా కానీ థియేటర్స్ కౌంట్ ఎక్కువగా ఉండటం తో షేర్ వచ్చింది, తొలిరోజు సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 50-60 లక్షల రేంజ్ లో కలెక్షన్స్ ని అందుకునే అవకాశం…

ఉందని అంచనా వేయగా సినిమా అంతకుమించి కలెక్షన్స్ ని అందుకుంటే సెన్సేషన్ అనిపించే రేంజ్ కలెక్షన్స్ అనిపించుకునే అవకాశం ఉండగా సినిమా మొత్తం మీద ఆ సెన్సేషన్ ని క్రియేట్ చేయలేదు, కానీ ఉన్నంతలో 60 లక్షల మార్క్ ని మొదటి రోజు బాక్స్ అఫీస్ దగ్గర క్రాస్ చేసి డీసెంట్ ఓపెనింగ్స్ ని అందుకుంది.

మొత్తం మీద సినిమా మొదటి రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…
👉Nizam: 19L
👉Ceeded: 11L
👉UA: 7L
👉East: 5L
👉West: 4L
👉Guntur: 7L
👉Krishna: 5L
👉Nellore: 3L
Total AP TG: 0.61CR(1CR~ Gross)
👉KA+ROI: 1.5L
👉OS: 0.5L~
TOTAL Collections: 0.63CR(1.04CR~ Gross)
ఇదీ సినిమా మొదటి రోజు సాధించిన కలెక్షన్స్ లెక్క…

సినిమా ను బాక్స్ ఆఫీస్ దగ్గర ఓన్ రిలీజ్ కాకుండా 2.75 కోట్ల రేంజ్ రేటు కి అమ్మగా సినిమా 3 కోట్ల రేంజ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగింది… మొదటి రోజు సాధించిన కలెక్షన్స్ కాకుండా ఇప్పుడు సినిమా మరో 2.37 కోట్ల షేర్ ని ఇంకా అందుకుంటే బ్రేక్ ఈవెన్ అవుతుంది. ఇక సినిమా రెండో రోజు ఎలాంటి కలెక్షన్స్ ని సాధిస్తుందో చూడాలి.

Leave a Comment