న్యూస్ రివ్యూ

గాడ్జిల్లా Vs కాంగ్ టాక్ ఏంటి…మినీ రివ్యూ!

హాలీవుడ్ మూవీస్ లో అవెంజర్స్, జస్టిస్ లీగ్, అవతార్ లాంటి మూవీస్ తర్వాత బిగ్గెస్ట్ హైప్ ను ట్రైలర్ రిలీజ్ తర్వాత సొంతం చేసుకున్న సినిమా గాడ్జిల్లా Vs కాంగ్… మే 31 న థియేటర్స్ లో అండ్ డిజిటల్ లో రిలీజ్ అవుతున్న ఈ సినిమా ఇండియా లో 24 నే రిలీజ్ ను సొంతం చేసుకుంది, మరి సినిమా ఎలా ఉంది ఎలాంటి రెస్పాన్స్ ను ఆడియన్స్ నుండి సొంతం చేసుకుంటుంది లాంటి విశేషాలను గమనిస్తే…

కథ పాయింట్ చాలా సింపుల్ సముద్రంలో ఉండే గాడ్జిల్లా సడెన్ గా జనసంద్రంలోకి వచ్చి విలయ తాండం ఆడుతుంది, దాంతో గాడ్జిల్లాని ఎలా ఆపాలో తెలియక కాంగ్ ని ఎలాగైనా బరిలోకి దింపాలి అని తీసుకు వస్తారు, తర్వాత ఏం జరిగింది, ఫైనల్ గా గాడ్జిల్లా Vs కాంగ్ లో ఎవరు గెలిచారు లాంటిది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే..

కథ పాయింట్ సింపుల్ అయినా రెండు గిగాంటిక్ మోన్ స్టర్స్ మధ్య పోటి సిల్వర్ స్క్రీన్ పై చూసేటప్పుడు వచ్చే ఫీలింగ్ నెక్స్ట్ లెవల్ అని చెప్పాలి, ఆ ఫైట్ సీన్స్, విజువల్స్, బ్యాగ్రౌండ్ స్కోర్ ఇలా అన్నీ నెక్స్ట్ లెవల్ లో ఉంటుంది అని చెప్పాలి. కొన్ని అప్ డౌన్ ఉన్నప్పటికీ కూడా…

ప్రతీ సీన్ విజువల్ వండర్ గా ఆదరగోట్టేసింది… ఇక గాడ్జిల్లా Vs కాంగ్ మధ్య మెయిన్ ఫైట్ సీన్స్ అయితే గూస్ బంప్స్ స్టఫ్ గా చెప్పుకోవాలి, ఆ సీన్స్ విజువల్స్ మైండ్ బ్లోయింగ్ అనిపించే విధంగా ఉందని చెప్పాలి. కథ పాయింట్ ఏమి లేకున్నా రెండు గిగాంటిక్ మోన్ స్టర్స్ పోటి పడితే ఎలా ఉంటుంది అనే ఆసక్తిని సినిమా ఏమాత్రం వమ్ము చేయకుండా ప్రతీ సీన్ లో హైప్ కి తగ్గట్లు దుమ్ము లేపింది అని చెప్పాలి.

నార్మల్ టైం లో సినిమా రిలీజ్ అయ్యి ఉంటె కచ్చితంగా వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ ను ఊహకందని లెవల్ లో షేక్ చేసి ఉండేది, ప్రస్తుత పరిస్థితులు ఎదురు దెబ్బ కొట్టినా కానీ ఓవరాల్ గా గాడ్జిల్లా Vs కాంగ్ వన్ ఆఫ్ బెస్ట్ యాక్షన్ మూవీస్ లో ఒకటిగా నిలిచే మూవీ అని చెప్పాలి. టైం ఉంటే ఈ మూవీ ని మాత్రం మిస్ చేసుకోకండి…

Leave a Comment