న్యూస్ రివ్యూ

గాలి తీశారు….భాగమతి హిందీ రీమేక్ ట్రైలర్ రివ్యూ!!

సినిమాలు రీమేక్ అవ్వడం సర్వ సాధారణంగా జరుగుతూ వస్తున్నవే… కానీ ఒరిజినల్ ని మరిపించే విధంగా రీమేక్ తెరకెక్కడం మాత్రం చాలా అరుదుగా జరుగుతుంది, రీమేక్ ని మ్యాచ్ కూడా చేయలేకపోవడం ఎక్కువగా జరుగుతుంది, ప్రస్తుతం బాలీవుడ్ లో రీమేక్ అయిన మరో సౌత్ మూవీ లేడీ సూపర్ స్టార్ అనుష్క నటించిన భాగమతి సినిమా హిందీ లో అక్షయ్ కుమార్ నిర్మాతగా భూమి పడ్నేకర్ మెయిన్ రోల్ లో దుర్గామతి పేరుతో….

రీమేక్ అవ్వగా సినిమా ట్రైలర్ ను రీసెంట్ గా లాంచ్ చేశారు. కాగా సినిమా ట్రైలర్ చూసిన వారు అందరూ కూడా ఒరిజినల్ తో కంపేర్ చేయకుండా ఉండరు, అలా చేసి చూస్తె అనుష్క పెర్ఫార్మెన్స్ ముందు భూమి పడ్నేకర్ పెర్ఫార్మెన్స్ అసలు సరితూగడం అటుంచి….

10% కూడా మ్యాచ్ చేసే విధంగా లేదంటూ బాలీవుడ్ వాళ్ళే విమర్శిస్తున్నారు, ఇక కథలో మార్పులు వద్దూ అని సేం డైరెక్టర్ నే తీసుకోగా ఒక్క షాట్ కూడా కొత్తగా ట్రై చేయకుండా సినిమా మొత్తాన్ని అలాగే సీన్ బై సీన్ రీమేక్ చేశారు అని ట్రైలర్ చూస్తె అర్ధం అవుతుంది,

దాంతో మరిన్ని విమర్శలు ఎదురుకుంటున్న ట్రైలర్ లో ఆకట్టుకునే అంశం అల్లా ఎప్పుడూ కామెడీ రోల్స్ చేసే అర్షద్ వార్సీ ఇప్పుడు నెగటివ్ రోల్ తో మెప్పించబోతూ ఉండటం అని చెప్పొచ్చు. అది తప్పితే ట్రైలర్ లో పెద్దగా చెప్పుకోవడానికి ఏమి లేదని చెప్పొచ్చు. ముందు థియేటర్స్ లో అనుకున్నా పరిస్థితుల వలన ఇప్పుడు ఈ సినిమా కూడా డైరెక్ట్ రిలీజ్ కాబోతుంది.

సినిమా టైటిల్ ని ముందు దుర్గావతి గా పెట్టినా కానీ గొడవల వలన మార్చేసి దుర్గామతిగా పెట్టేశారు. ఇక సినిమాను డిసెంబర్ 11 న డైరెక్ట్ రిలీజ్ చేయబోతున్నట్లు సమాచారం. ట్రైలర్ వరకు భాగమతి దరిదాపుల్లోకి కూడా రాని ఈ సినిమా… ఓవరాల్ సినిమా పరంగా ఎంతవరకు ఆకట్టుకుంటుందో సినిమా రిలీజ్ అయ్యాక తెలుస్తుంది.

Leave a Comment