గాసిప్స్ న్యూస్

గాసిప్: మూడేళ్ళ క్రితం ఎన్టీఆర్ తో అనుకున్న సినిమాలో అల్లు అర్జున్!

  ఒకరి తో అనుకున్న సినిమాలు అనేక కారణాల వల్ల మరొకరితో చేయడం అన్నది సర్వ సాధారనంగా జరుగుతూ వస్తున్నదే. కారణాలు ఏవైనా కావచ్చు ముందు ఒకరిని దృష్టి లో పెట్టుకుని తర్వాత వారు సెట్ కారు అని, వాళ్ళకి నచ్చక అనేక సినిమాలు చేతులు మారుతూ ఉంటుంది. ఇప్పుడు అలాంటి కోవ లోకే ఓ పెద్ద సినిమా వస్తుంది అంటూ ఇండస్ట్రీ లో వార్తలు గట్టిగానే చక్కర్లు కొడుతుంది. ఆ వార్తల ప్రకారం…

రీసెంట్ గా కొరటాల శివ డైరెక్షన్ లో అల్లు అర్జున్ హీరోగా యువ సుధ ప్రొడక్షన్ లో మిక్కిలినేని సుధాకర్ నిర్మాతగా కొత్త సినిమా మొదలు కాబోతున్న విషయం తెలిసిందే. కాగా ఈ ప్రాజెక్ట్ తో అందరి దృష్టి ఇప్పుడు మూడేళ్ళ క్రితం అనౌన్స్ అయిన సినిమా పై పడింది.

ఎన్టీఆర్ మరియు కొరటాల శివ ల కాంబినేషన్ లో జనతాగ్యారేజ్ తర్వాత మరో కొత్త సినిమా ఒకటి యువ సుధ ప్రొడక్షన్ లో మిక్కిలినేని సుధాకర్ నిర్మాతగా అనౌన్స్ చేసి ఓ పోస్టర్ ని కూడా రిలీజ్ చేశారు. ఈ సినిమా అన్నీ అనుకున్నట్లు జరిగితే…

అరవింద సమేత ప్లేస్ లో తెరకెక్కాల్సి ఉండేది… కానీ కథ పెర్ఫెక్ట్ గా సెట్ కాకపోవడమో, లేదా అప్పటికే త్రివిక్రమ్ మూవీ కమిట్ అవ్వడం వలనో ఈ సినిమా ఆగిపోయింది. మళ్ళీ ఇప్పుడు మూడేళ్ళ తర్వాత ఇదే డైరెక్టర్ అండ్ ప్రొడక్షన్ హౌస్ లో హీరో మాత్రమే చేంజ్ అయ్యి మిగిలినవన్నీ కూడా అలానే ఉండటం తో…

ఇండస్ట్రీలో ఇది ఎన్టీఆర్ తో అనుకున్న సినిమానే అల్లు అర్జున్ తో చేస్తున్నారు అని టాక్ స్ప్రెడ్ అవుతుంది, కానీ అప్పుడు చెప్పిన కథ ఇప్పుడు అల్లు అర్జున్ తో అనుకున్న కథ వేరని అంటున్నారు. ఎన్టీఆర్ న్యూ కమిట్ మెంట్స్ వలన ఈ ప్రాజెక్ట్ ని పోస్ట్ పోన్ చేశారు తప్పితే హీరో ఏమి మారలేదు అని సమాచారం. ఫ్యూచర్ లో ఎన్టీఆర్ కమిట్ మెంట్స్ తర్వాత వీళ్ళ ప్రాజెక్ట్ ఉంటుందని అంటున్నారు.

Leave a Comment