న్యూస్ బాక్స్ ఆఫీస్

గుణ369 కలెక్షన్స్: 7.7 కోట్ల టార్గెట్…11 రోజుల్లో వచ్చింది ఇది…పాపం!!

Rx100 హీరో కార్తికేయ హీరోగా తెరకెక్కిన లేటెస్ట్ మూవీ గుణ 369, బాక్స్ ఆఫీస్ దగ్గర లాస్ట్ వీక్ రిలీజ్ అయిన ఈ సినిమా పర్వాలేదు అనిపించే టాక్ ని సొంతం చేసుకుంది కానీ కలెక్షన్స్ మాత్రం అనుకున్న రేంజ్ లో రావడం లేదు. హీరో రేంజ్ కి కలెక్షన్స్ బాగానే అనిపించినా కానీ సినిమా బిజినెస్ ఎక్కువ అవ్వడం తో ఈ కలెక్షన్స్ ఆ బిజినెస్ కి ఏమాత్రం న్యాయం చేసేలా లేవు.

సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 11 రోజులను పూర్తి చేసుకోగా రెండు తెలుగు రాష్ట్రాలలో మొత్తం మీద 3.17 కోట్ల షేర్ దాకా వసూల్ చేసింది, ఇక వరల్డ్ వైడ్ గా సినిమా 3.46 కోట్ల దాకా షేర్ ని అందుకుంది బాగానే వచ్చాయి అనిపించుకుంది. కానీ సినిమా బిజినెస్ ని అందుకోవాలి అంటే…

గుణ 369 సినిమా సాధించిన ఈ కలెక్షన్స్ సరిపోవు అనే చెప్పాలి. బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా ను ఏకంగా 6.7 కోట్లకు అమ్మారు. దాంతో ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అవ్వాలి అంటే సుమారు 7.7 కోట్ల రేంజ్ షేర్ ని అందుకోవాలి అన్న టార్గెట్ తో బరిలోకి దిగింది.

కాగా ఇప్పటి వరకు సాధించిన కలెక్షన్స్ తో సగం కూడా రికవరీ అవ్వలేదు. ఇక సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర బ్రేక్ ఈవెన్ అవ్వాలి అంటే మరో 4.24 కోట్ల వరకు షేర్ ని ఇప్పటి నుండి అందుకోవాల్సి ఉంటుంది. దాంతో సినిమా ఆ మార్క్ ని అందుకోవడం దాదాపు అసాధ్యం అనే చెప్పాలి.

అదే సినిమా బిజినెస్ 3.5 కోట్ల రేంజ్ లో ఉండి ఉంటే సినిమా ఈ వారం ముగిసే లోపు బిజినెస్ ని అందుకుని ఉండేది, తర్వాత రోజుల్లో సాధించిన మినిమం కలెక్షన్స్ తో బ్రేక్ ఈవెన్ ని పూర్తి చేసుకుని ఉండేది, కానీ బిజినెస్ ఎక్కువ అవ్వడం వలన సినిమా కి కలెక్షన్స్ పర్వాలేదు అనిపించే విధంగా వచ్చినా ఏమాత్రం సరిపోలేదు అని చెప్పాలి….

Leave a Comment

Do NOT follow this link or you will be banned from the site!