గాసిప్స్ న్యూస్

గూస్ బంప్స్ ఫైట్ అనుకున్నారు…తేడా కొట్టింది!!

టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రాజకీయాలతో పాటు సినిమా లకు కూడా కొంత సమయం కేటాయించాలని డిసైడ్ అయ్యి ముందుగా మొదలు పెట్టిన సినిమా వకీల్ సాబ్… అన్నీ సజావుగా సాగి ఉంటే సినిమా రిలీజ్ అయ్యి ఈ పాటికే ఒక వారం గడచి ఉండేది, కానీ లాక్ డౌన్ వలన సినిమా మిగిలిన సమ్మర్ సినిమా లతో కలిసి పోస్ట్ పోన్ అవ్వాల్సిన పరిస్థితి ఏర్పడిన విషయం తెలిసిందే.

ఇక సినిమా ఏ షూటింగ్ టైం లో ఆగిపోయింది అన్నది ఇప్పుడు రివీల్ అయింది, సినిమా ఒరిజినల్ వర్షన్ లో ఎలాంటి ఫైట్స్ ఉండవు కానీ, తమిళ్ లో రీమేక్ చేసినప్పుడు ఇంటర్వెల్ టైం లో అజిత్ కుమార్ కోసం సాలిడ్ ఫైట్ సీన్ ని చిత్రీకరించారు.

కాగా దాన్ని మించే రేంజ్ లో పవన్ కళ్యాణ్ యాటిట్యూడ్ కి తగ్గట్లు ఓ సాలిడ్ ఫైట్ సీన్ ని ప్లాన్ చేసి అన్నీ సెట్ చేసుకున్న తరుణం లో లాక్ డౌన్ మొదలు అవ్వడం తో ఆ ఫైట్ సీన్ కూడా ఆగి పోయింది అంట… దాదాపు ఈ ఫైట్ సీన్ కోసం…

80 లక్షల మేర ఖర్చు చేసారట…కానీ లాక్ డౌన్ వలన ఆగిపోవడం జరిగింది, సుమారు 30 మంది తో ఈ ఫైట్ సీన్ ఉంటుందట. కానీ ఇప్పుడు తిరిగి లాక్ డౌన్ తర్వాత 30 మందితో ఫైట్ సీన్ ని వెంటనే షూట్ చేయడం కష్టమే అని, దాన్ని మార్చే అవకాశం కూడా ఉందని టాక్ వస్తుంది.

10 మందితో ఈ ఫైట్ సీన్ ని మార్చి తీసే అవకాశం ఉందని టాక్ ఉంది, మరి ఇది ఎంతవరకు నిజమో తెలియదు కానీ భారీ ఫైట్ సీన్ ని ప్లాన్ చేసి తేడా కొట్టి ఇప్పుడు కేవలం 10 మందితోనే ఫైట్ సీన్ షూట్ చేయబోతున్నారట. ఫైట్ జరిగేది తక్కువ మందితో అయినా ఎక్కువ మందితో అయినా ఆడియన్స్ కి మాత్రం గూస్ బంప్స్ తెప్పించేలా ఈ ఫైట్ ని డిసైన్ చేశారట. ఇక ఆ గూస్ బంప్స్ ఫైట్ చూడాలి అంటే మరికొన్ని నెలలు ఆగాల్సిందే అని చెప్పొచ్చు…

Leave a Comment