టోటల్ కలెక్షన్స్ న్యూస్ బాక్స్ ఆఫీస్

గోపీచంద్ ఆరడుగుల బుల్లెట్ టోటల్ కలెక్షన్స్…ఏంటి సామి ఇది!!

యాక్షన్ హీరో గోపీచంద్ నటించిన ఓల్డ్ మూవీ ఆరడుగుల బుల్లెట్ ఎప్పుడో 2017 టైం లోనే ఆడియన్స్ ముందుకు రావాల్సింది కానీ ఎప్పటికప్పుడు పరిస్థితుల ఇంపాక్ట్ వలన ఈ సినిమా రిలీజ్ పోస్ట్ పోన్ అవుతూ రాగా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఇప్పుడు 2021 లో డిజిటల్ రిలీజ్ లను కాన్సిల్ చేసుకుని ఆడియన్స్ ముందుకు థియేటర్స్ లో రిలీజ్ అయింది… సినిమా కథ ఇప్పటిది కాదు కాబట్టి రొటీన్ స్టొరీ కి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో…

అదే సినిమా కి రివ్యూల రూపంలో టాక్ స్ప్రెడ్ అవ్వగా సీటిమార్ సినిమా తో కంబ్యాక్ ఇచ్చాడు కానీ ఓపెనింగ్స్ అయినా ఈ సినిమా కి వస్తాయి అనుకుంటే బాక్స్ ఆఫీస్ దగ్గర పెద్దగా ఇంపాక్ట్ ఏమి చూపకుండానే చేతులు ఎత్తేసింది ఈ సినిమా…

మొత్తం మీద ఫస్ట్ 5 డేస్ లో అటూ ఇటూగా కోటి లోపు షేర్ ని సొంతం చేసుకున్న ఈ సినిమా పరుగు కంప్లీట్ అయ్యే టైం కి తెలుగు రాష్ట్రాలలో మరో 36 లక్షల మేర షేర్ ని ఓవరాల్ గా సొంతం చేసుకుంది. దాంతో సినిమా టోటల్ రన్ కలెక్షన్స్ లెక్క ఇలా ఉంది…

👉Nizam: 36L
👉Ceeded: 25L
👉UA: 15L
👉East: 13L
👉West: 10L
👉Guntur: 12L
👉Krishna: 10L
👉Nellore: 7L
AP-TG Total:- 1.28CR(2.25CR~ Gross)
Rest – 10L~
Total WW – 1.38Cr(2.48CR~ Gross)
ఇదీ సినిమా టోటల్ రన్ లో బాక్స్ ఆఫీస్ దగ్గర సాధించిన టోటల్ కలెక్షన్స్ లెక్క… సినిమా ను మొత్తం మీద ట్రేడ్ లెక్కల ప్రకారం….

2.95 కోట్ల రేంజ్ రేటు కి అమ్మగా సినిమా 3.2 కోట్ల రేంజ్ టార్గెట్ తో బరిలోకి దిగగా టోటల్ రన్ కంప్లీట్ అయ్యే టైం కి సినిమా 1.82 కోట్ల రేంజ్ లో లాస్ అయ్యి డిసాస్టర్ గా నిలిచింది, సినిమాకి డైరెక్ట్ డిజిటల్ రిలీజ్ కోసం 6-7కోట్ల రేంజ్ ఆఫర్స్ వచ్చాయి, వాటికి ఓకే చెప్పి ఉన్నా బాగుండేది అని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.

Leave a Comment