గాసిప్స్ న్యూస్

గోపీచంద్ తో నాగ చైతన్య పోటి….ఇద్దరూ ఆ డేట్ కే!

బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ ఇయర్ ఆడియన్స్ ముందుకు రావాల్సిన క్రేజీ మూవీస్ లో నాగ చైతన్య లవ్ స్టొరీ ఒకటి, అలాగే కంబ్యాక్ కోసం ఎదురు చూస్తున్న గోపీచంద్ నటించిన లేటెస్ట్ మూవీ సీటిమార్ పై కూడా ఆడియన్స్ లో మంచి అంచనాలు ఉన్నాయి. ఈ రెండు సినిమాలు కూడా ముందు సమ్మర్ రేసులో అనౌన్స్ చేసినా సెకెండ్ వేవ్ ఎఫెక్ట్ వలన రిలీజ్ లు పోస్ట్ పోన్ చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది.

లవ్ స్టొరీ కి టాలీవుడ్ లోనే ఆల్ టైం హైయెస్ట్ డిజిటల్ రిలీజ్ ఆఫర్స్ లు వచ్చాయి, అయినా కానీ ఈ సినిమా థియేటర్స్ లోనే రిలీజ్ అవుతుందని మేకర్స్ కన్ఫాం చేశారు. మరో పక్క గోపీచంద్ సీటిమార్ కి కూడా ఉన్నంతలో సాలిడ్ డీల్స్ వచ్చాయి.

అయినా కానీ గోపీచంద్ కూడా బాక్స్ ఆఫీస్ దగ్గరే కంబ్యాక్ ఇవ్వాలని ఫిక్స్ అయ్యి వచ్చిన ఆఫర్స్ కి నో చెప్పాడు… కాగా ఇప్పుడు ఈ ఇద్దరూ కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర తమ సినిమాలను ఒకే డేట్ ను టార్గెట్ చేసి రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారని సమాచారం…

వచ్చే నెలలో వినాయక చవితి పండగ ఉండగా ఆ పండగని టార్గెట్ చేసి ఈ సినిమాలను రిలీజ్ చేయాలనీ అనుకుంటున్నారు. ముందు ఆ డేట్ కి గోపీచంద్ సీటిమార్ ని అనుకోగా సడెన్ గా ఇప్పుడు లవ్ స్టొరీ కి కూడా అదే డేట్ బెటర్ ఆప్షన్ గా అనిపిస్తుందని అంటున్నారు. ఆ డేట్ అయితే పండగ టైం లో జనాలు మరింతగా థియేటర్స్ కి వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారట.

లవ్ స్టొరీ సినిమా ప్రెజెంట్ ఉన్న మీడియం రేంజ్ మూవీస్ లో బిగ్గెస్ట్ హైప్ ను సొంతం చేసుకున్న సినిమా గా చెప్పుకోవాలి, ఆ హైప్ ను క్రేజ్ ను గోపీచంద్ సీటిమార్ తో మాస్ కంబ్యాక్ అండ్ బాక్స్ ఆఫీస్ దగ్గర మాస్ కలెక్షన్స్ తో ఎంతవరకు పోటి ఇవ్వగలడు అనేది ఆసక్తి కరం, త్వరలోనే రెండు సినిమాల అఫీషియల్ రిలీజ్ డేట్స్ వస్తాయని అంటున్నారు ఇప్పుడు.

Leave a Comment