న్యూస్ బాక్స్ ఆఫీస్

గోపీచంద్ లాస్ట్ 5 మూవీస్ డే 1 కలెక్షన్స్…పాతాళం నుండి 2nd బెస్ట్ కొట్టాడు!

2014 టైం లో లౌక్యం సినిమా తో కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ ను సొంతం చేసుకున్న గోపీచంద్ తర్వాత టైం లో బాక్స్ ఆఫీస్ దగ్గర ఒక్కసారి కూడా హిట్ గీతని దాటలేక పోయాడు. ఎన్ని ప్రయత్నాలు చేసినా కానీ బాక్స్ ఆఫీస్ దగ్గర ఒక్క విజయం కూడా సొంతం అవ్వలేదు సరికగా మంచి టాక్ ని సొంతం చేసుకున్న సినిమాలు కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర తీవ్రంగా బొక్క బోర్లా పడ్డాయి.

ముఖ్యంగా గోపీచంద్ లాస్ట్ మూవీ చాణక్య భారీ బడ్జెట్ తో తెరకేక్కినా కానీ మినిమం ఇంపాక్ట్ ని క్రియేట్ చేయలేక భారీ డిసాస్టర్ గా నిలిచింది. ఆ సినిమా ఫస్ట్ డే కేవలం 97 లక్షల రేంజ్ షేర్ ని సొంతం చేసుకుంది. అలాంటి డిసాస్టర్ తర్వాత ఇప్పుడు గోపీచంద్…

నుండి వచ్చిన సీటిమార్ చాలా సార్లు పోస్ట్ పోన్ అయినా సెకెండ్ వేవ్ తర్వాత దుమ్ము లేపిన టాలీవుడ్ మూవీ గా నిలిచింది. ఒకసారి గోపీచంద్ లాస్ట్ 5 మూవీస్ ఫస్ట్ డే కలెక్షన్స్ ని గమనిస్తే… గోపీచంద్ సంపత్ నందిల కాంబోలో వచ్చిన గౌతమ్ నంద ఫస్ట్ డే 3.29 కోట్లతో…

గోపీచంద్ కెరీర్ లో టాప్ షేర్ ని ఫస్ట్ డే అందుకున్న సినిమాగా నిలవగా తర్వాత చేసిన ఆక్సీజన్ సినిమా 1.61 కోట్ల షేర్ ని అందుకుంది, ఇక తర్వాత చేసిన పంతం గోపీచంద్ కెరీర్ లో 25 వ సినిమాగా రాగా ఈ సినిమా 2.82 కోట్లతో కెరీర్ టాప్ 2 ప్లేస్ ను అందుకుంది, తర్వాత చాణక్య ఫస్ట్ డే 97 లక్షలతో మార్కెట్ కోల్పోయాడు అనేలా ఓపెన్ అవ్వగా…

ఇప్పుడు కంబ్యాక్ మూవీ సీటిమార్ ఫస్ట్ డే 2.98 కోట్ల షేర్ ని అందుకుని కెరీర్ లో ఆల్ టైం టాప్ 2 ఓపెనర్ గా నిలిచింది, ఆంధ్రలో 100% ఆక్యుపెన్సీ టికెట్ హైక్స్ ఉండి ఉంటే సినిమా 4.5 కోట్లకు తగ్గని షేర్ ని ఫస్ట్ డే సొంతం చేసుకుని ఉండేది, అయినా కానీ ఓవరాల్ గా కెరీర్ టాప్ 2 తో కంబ్యాక్ సాలిడ్ గా ఇచ్చాడు గోపీచంద్..

Leave a Comment