న్యూస్ బాక్స్ ఆఫీస్

గ్యాంగ్ లీడర్ కలెక్షన్స్: 28 కోట్లకు అమ్మితే…9 రోజుల్లో వచ్చింది ఇది!!

నాచురల్ నాని లేటెస్ట్ మూవీ గ్యాంగ్ లీడర్ మొదటి వారాన్ని పడుతూ లేస్తూ 19.52 కోట్ల షేర్ తో ముగించగా రెండో వీక్ లో సినిమా మొదటి రోజు రెండు కొత్త సినిమాల వల్ల ఎఫెక్ట్ అయ్యి 16 లక్షల షేర్ ని మాత్రమె రాబట్టింది, ఇక సినిమా 9 వ రోజున తిరిగి కొద్ది వరకు పుంజుకుని డబుల్ వసూళ్ళ ని సాధించింది కానీ అది సినిమా బిజినెస్ కి న్యాయం చేసే రేంజ్ లో అయితే లేవనే చెప్పాలి.

సినిమా మొత్తం మీద 9 వ రోజున రెండు తెలుగు రాష్ట్రాలలో సాధించిన కలెక్షన్స్ ని ఒకసారి గమనిస్తే
?Nizam- 16L
?Ceeded- 4L
?UA- 6L
?East- 3L
?West- 2L
?Guntur- 2.5L
?Krishna- 2.3L
?Nellore- 1.4L
AP-TG Day 9:- 37.2L ఇదీ సినిమా సాధించిన షేర్లు.

ఇక సినిమా 9 రోజులకు గాను సాధించిన టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ లెక్కలను గమనిస్తే
?Nizam- 6.03Cr
?Ceeded- 1.85Cr
?UA- 2.04Cr
?East- 1.31Cr
?West- 0.91Cr
?Guntur- 1.18Cr
?Krishna- 1.11Cr
?Nellore- 0.50Cr
AP-TG 9 Days:- 14.93Cr
KA & ROI – 1.66Cr
OS – 3.81Cr
Total 9 Days – 20.40Cr

గ్యాంగ్ లీడర్ సినిమా 9 రోజులు పూర్తీ అయ్యే సరికి టోటల్ వరల్డ్ వైడ్ గా 34.65 కోట్ల దాకా గ్రాస్ ని వసూల్ చేసింది, కానీ సినిమా ను టోటల్ గా 28 కోట్లకు అమ్మగా 29 కోట్ల టార్గెట్ తో బరిలోకి దిగిన ఈ సినిమా ఇప్పటి వరకు సాధించిన కలెక్షన్స్ కాకుండా లాంగ్ రన్ లో…

మరో 8.6 కోట్ల షేర్ ని వసూల్ చేస్తేనే బ్రేక్ ఈవెన్ అవుతుంది, ఆదివారం మళ్ళీ పుంజుకునే అవకాశం ఉన్నా కానీ సినిమా లాంగ్ రన్ లో ప్రస్తుతానికి అయితే బిజినెస్ ని అందుకునే దిశగా అడుగులు వేయడం లేదు. కానీ ఆదివారం ఊహకందని గ్రోత్ ని సాధిస్తే మళ్ళీ రేసు లో నిలిచే అవకాశం ఉంటుంది.

Leave a Comment