న్యూస్ బాక్స్ ఆఫీస్

గ్యాంగ్ లీడర్ ఫస్ట్ డే ఓపెనింగ్స్….షాకింగ్ ఓపెనింగ్స్!!

నాచురల్ స్టార్ నాని నటించిన లేటెస్ట్ మూవీ గ్యాంగ్ లీడర్ బాక్స్ ఆఫీస్ దగ్గర రీసెంట్ గా రిలీజ్ అవ్వగా సినిమా కి మంచి టాక్ లభించింది, ఇక సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ నాలుగు రోజుల ముందే మొదలు అయినా కానీ అడ్వాన్స్ సేల్స్ మరీ అనుకున్న రేంజ్ లో లేకున్నా రిలీజ్ మొదటి రోజు మొదటి షో సమయానికి ఆన్ లైన్ అండ్ ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ బాగున్నాయి.

కానీ అవి నాని రీసెంట్ మూవీస్ తో పోల్చితే తక్కువగా ఉండటం కొంచం షాక్ ని కలిగించే విషయమే… కానీ టాక్ బాగానే ఉండటం తో సినిమా షో షో కి ఇంప్రూవ్ మెంట్ చూపించే అవకాశం అయితే గట్టిగానే ఉందని చెప్పాలి. బాక్స్ ఆఫీస్ దగ్గర మొత్తం మీద మొదటి రోజు…

తొలి 2 షోల విషయానికి వస్తే ఆక్యుపెన్సీ 40% కి పైగా ఉంది, క్లాస్ సెంటర్స్ బాగున్నా మాస్ సెంటర్స్ కొంచం వీక్ గా ఓపెన్ అయ్యాయి. కానీ ఈవినింగ్ అండ్ నైట్ షోల అడ్వాన్స్ బుకింగ్స్ బాగుండటం తో సినిమా రోజు ముగిసే సమయానికి మంచి కలెక్షన్స్ అందుకునే అవకాశం ఉంది.

ప్రస్తుతం ఉన్న ఓపెనింగ్స్ ని బట్టి 3.5 కోట్ల రేంజ్ ఓపెనింగ్స్ కన్ఫాం అని చెప్పొచ్చు. ఇక మొదటి రోజు ఈవినింగ్ అండ్ నైట్ షోలలో గ్రోత్ బాగుండి దానికి తోడూ ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ కూడా జోరు అందుకుంటే సినిమా 4 కోట్ల నుండి 4.5 కోట్ల దాకా షేర్ ని అందుకునే అవాకాశం ఉంది.

అప్పుడు డీసెంట్ ఓపెనింగ్స్ తో తొలిరోజు ని ముగించే అవకాశం ఉంటుంది, మరి రోజు ముగిసే సరికి సినిమా బాక్స్ ఆఫీస్ స్టేటస్ ఏ విధంగా ఉంటుందో చూసి మరో ఆర్టికల్ లో అప్ డేట్ చేస్తాం. న్యూస్ అప్ డేట్స్ కోసం బెల్ ఐకాన్ ని ప్రెస్ చేసి సబ్ స్బైబ్ చేసుకోండి.. అప్ డేట్ రాగానే నోటిఫికేషన్ మీకు అందుతుంది.

Leave a Comment

Do NOT follow this link or you will be banned from the site!