న్యూస్ స్పెషల్

గ్యాంగ్ లీడర్ TRP రేటింగ్: అమ్మింది 8 కోట్లకు…వచ్చిన TRP రేటింగ్ ఇది!!

నాచురల్ స్టార్ నాని నటించిన లేటెస్ట్ మూవీ గ్యాంగ్ లీడర్ బాక్స్ ఆఫీస్ దగ్గర లాస్ట్ ఇయర్ రిలీజ్ అయిన విషయం తెలిసిందే, జెర్సీ తో సూపర్ హిట్ కొట్టిన జోష్ లో ఉన్న నాని విక్రం కుమార్ తో చేసిన ఈ సినిమా పర్వాలేదు అనిపించే టాక్ ని సొంతం చేసుకున్నా కానీ బాక్స్ ఆఫీస్ దగ్గర అనుకున్న రేంజ్ లో కలెక్షన్స్ ని అందుకోవడమ్ లో విఫలం అయినా ఓవరాల్ గా…

23.4 కోట్ల షేర్ తో యావరేజ్ గా పరుగును ముగించింది, సినిమా క్రేజ్ దృశ్యా సినిమా ని జెమినీ టీవీ వారు భారీ రేటు చెల్లించి శాటిలైట్ హక్కులను సొంతం చేసుకున్నారు, ఏకంగా 8 కోట్ల రేటు చెల్లించి హక్కులను దక్కించుకోగా టెలికాస్ట్ చేయడానికి మాత్రం…

చాలా సమయమే తీసుకోవడం తో ఆ ఇంపాక్ట్ TRP రేటింగ్ పై పడింది. సినిమా రీసెంట్ గా తొలిసారి టెలికాస్ట్ అవ్వగా సినిమా కి వచ్చిన TRP రేటింగ్ 8.66 వచ్చింది.. ఇది ఓవరాల్ గా చూసుకుంటే డీసెంట్ TRP రేటింగ్ అనే చెప్పాలి. అదే సమయం లో ఇతర చానెల్స్ లో వేరే సినిమాలు కూడా టెలికాస్ట్ అయినా…

గ్యాంగ్ లీడర్ పర్వాలేదు అనిపించే TRP రేటింగ్ ని సొంతం చేసుకుంది, ఇక నాని నటించిన అంతకు ముందు సినిమాలు అయిన జెర్సీ కి 8.8 TRP రేటింగ్ దక్కగా అంతకన్నా ముందు చేసిన మల్టీ స్టారర్ మూవీ దేవదాస్ సినిమా కి 8.3 TRP రేటింగ్ దక్కింది. వాటితో ఆల్ మోస్ట్ ఈక్వల్ లెవల్ లోనే ఈ సినిమాకి రేటింగ్ దక్కింది.

ఇక నాచురల్ స్టార్ నాని అప్ కమింగ్ మూవీ “వి ది మూవీ” 2020 సమ్మర్ కానుకగా రిలీజ్ కాబోతున్న మొదటి సినిమాగా రాబోతుంది, మార్చి ఎండింగ్ లో ఉగాది కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా నాని తన కెరీర్ బెస్ట్ రికార్డులను బ్రేక్ చేయాలని కోరుకుందాం…

Leave a Comment