న్యూస్ బాక్స్ ఆఫీస్ స్పెషల్

చరిత్రకెక్కిన అల్లు అర్జున్…50 కోట్లు ఏంటి సామి!!

సరైనోడు తర్వాత మళ్ళీ సరైన విజయం కోసం అల్లు అర్జున్ చాలా కష్ట పడాల్సి వచ్చింది, దువ్వాడ జగన్నాథం మరియు నా పేరు సూర్య సినిమాలు ఆశించిన విజయాన్ని అందుకొని సమయం లో తనకి జులాయి, సన్ ఆఫ్ సత్యమూర్తి సినిమాలతో హిట్స్ ఇచ్చిన త్రివిక్రమ్ డైరెక్షన్ లో అల్లు అర్జున్ నటించిన లేటెస్ట్ మూవీ అల వైకుంఠ పురం లో బాక్స్ ఆఫీస్ దగ్గర ఊచకోత కోసే విజయాన్ని సొంతం చేసుకుంది.

సినిమా 10 రోజులు పూర్తీ అయ్యే సరికి వరల్డ్ వైడ్ గా ఏకంగా 131.68 కోట్ల షేర్ ని సాధించి చరిత్ర సృష్టిస్తూ నాన్ బాహుబలి మూవీస్ లో తెలుగు వర్షన్ తో 130 కోట్ల షేర్ మార్క్ ని అందుకున్న మొదటి సినిమాగా నిలిచి సంచలనం సృష్టించింది.

ఇక సినిమా ప్రాఫిట్ విషయం లో కూడా చరిత్రకేక్కబోతుంది. టాలీవుడ్ లో బిజినెస్ పై ఎక్కువ లాభాన్ని సొంతం చేసుకున్న సినిమాల్లో గీత గోవిందం 15 కోట్ల బిజినెస్ కి 70.43 కోట్ల షేర్ తో 55.43 కోట్ల ప్రాఫిట్ ని అందుకోగా… ఎఫ్ 2 సినిమా 34.5 కోట్ల బిజినెస్ కి 84.5 కోట్ల షేర్ తో 50 కోట్ల ప్రాఫిట్ ని అందుకుంది.

ఇక ఇప్పుడు 84.34 కోట్ల బిజినెస్ కి 10 రోజుల్లో 131.68 కోట్ల షేర్ ని అందుకున్న అల వైకుంఠ పురం లో టోటల్ గా…47.34 కోట్ల ప్రాఫిట్ ని అందుకోగా 11 వ రోజు సాధించిన కలెక్షన్స్ తో 50 కోట్ల ప్రాఫిట్ మార్క్ ని అధిగమించి చరిత్ర సృష్టించబోతుంది. సినిమా లాంగ్ రన్ లో గీత గోవిందం ని కూడా దాటేసి…

టాలీవుడ్ హిస్టరీ లోనే ఆల్ టైం హైయెస్ట్ ప్రాఫిట్ ని సొంతం చేసుకున్న నాన్ బాహుబలి మూవీ గా చరిత్ర సృష్టించడం ఖాయమని చెప్పొచ్చు. ఈ రికార్డ్ బ్రేక్ అవ్వాలి అంటే ఇప్పట్లో కష్టమే అని చెప్పాలి, కానీ ఈ ఇయర్ మరిన్ని పెద్ద సినిమాలు ఉన్నాయి కాబట్టి ఏవైనా సినిమాలు బ్రేక్ చేస్తాయో చూడాలి.

Leave a Comment