న్యూస్ బాక్స్ ఆఫీస్ స్పెషల్

చరిత్రలో ఒకేఒక్కడు…9 సార్లు 1 మిలియన్…సామి శిఖరం కాదు పర్వతం!!

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కి రెండు రాష్ట్రాల తర్వాత అతి పెద్ద మార్కెట్ ఓవర్సీస్, సినిమా ఎలా ఉన్నా మినిమం 1 మిలియన్ ని అక్కడ అందుకోవడం మాత్రం ఖాయం, కానీ ఈ సారి అవెంజర్స్ ఎఫెక్ట్ వల్ల అనుకున్న రేంజ్ లో రిలీజ్ కాలేక కలెక్షన్స్ కోసం కష్టపడుతూ మూడో రోజు దాకా 1 మిలియన్ కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. సినిమా ఈ రోజు అక్కడ 1 మిలియన్ మార్క్ ని అందుకో బోతుంది.

దాంతో సూపర్ స్టార్ మహేష్ బాబు కెరీర్ లో 9 వ సారి 1 మిలియన్ మార్క్ ని అందుకోబోతున్న సినిమా గా మహర్షి సంచలనం సృష్టించనుంది. ఇది వరకు మహేష్ నటించిన సినిమాల్లో…. దూకుడు, సీతమ్మ వాకిట్లో సిరి మల్లె చెట్టు, 1 నేనొక్కడినే, ఆగడు…

శ్రీమంతుడు, బ్రహ్మోత్సవం, స్పైడర్, భరత్ అనే నేను మరియు మహర్షి సినిమాలు ఈ మార్క్ ని అందుకున్నాయి. టాలీవుడ్ చరిత్ర లోనే మరే హీరో కి కూడా ఈ రేంజ్ లో 1 మిలియన్ మూవీస్ ఓవర్సీస్ లో లేవు. ఆ లెక్కన చెప్పాలంటే మహేష్ బాబు అక్కడ శిఖరం కాదు… పర్వతం అనే చెప్పాలి.

Leave a Comment

Do NOT follow this link or you will be banned from the site!