టోటల్ కలెక్షన్స్ న్యూస్

చరిత్రలో తొలిసారి….ఒక విలన్ మూవీ తో 7300 కోట్లు…ఎపిక్!!

కలెక్షన్స్ రావాలంటే బాక్స్ ఆఫీస్ దగ్గర ఎప్పుడైనా హీరో పేరు మీదే కాసులు రాలేది, ఏవో కొన్ని సినిమాల్లో విలన్ రోల్స్ కి పేరు వస్తుంది కానీ విలన్ రోల్ మీదే సినిమా నడిచేంత సత్తా ఉన్న సినిమా అయితే ఇప్పటి వరకు రాలేదు. కానీ చరిత్ర లో ఎప్పుడూ లేని విధంగా ఒక విలన్ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర భీభత్సం సృష్టించి ఆల్ టైం రికార్డులను నమోదు చేసి ఏకంగా హీరోల సినిమాలే కాకుండా.. సూపర్ హీరోల…

సినిమాల లైఫ్ టైం కలెక్షన్స్ ని కూడా బ్రేక్ చేసి సంచలనం సృష్టించింది. ఆ సినిమానే జోకర్. హాలీవుడ్ లో మార్వేల్ కంపెనీ తో పోటి పడుతూ సూపర్ హీరోల మూవీస్ రూపొందించే DC కంపెనీ ఈ మధ్య కాలంలో స్లో డౌన్ అవ్వగా మరో పక్క మార్వేల్ నుండి…

వచ్చిన ప్రతీ అవెంజర్ మూవీ కానీ ఇతర క్యారెక్టర్స్ అయిన ఐరన్ మాన్, తోర్, హల్క్, బ్లాక్ పాంథర్, కాప్టన్ మార్వేల్ లాంటి సినిమాలు సంచలనాలు సృష్టిస్తున్న సమయంలో ఇప్పటికీ 2008 లో వచ్చిన బ్యాట్ మాన్ సిరీస్ లోని ది డార్క్ నైట్ సినిమానే బిగ్గెస్ట్ బెంచ్ మార్క్ గా DC కంపెనీ కొనసాగిస్తుంది.

కానీ లాస్ట్ ఇయర్ లో వచ్చిన జోకర్ లాంగ్ రన్ ని ఈ ఇయర్ మార్చ్ వరకు కొనసాగించింది. ది డార్క్ నైట్ లో బ్యాట్ మాన్ రోల్ తో సమానంగా హైలెట్ అయిన జోకర్ క్యారెక్టర్ నేపధ్యంలో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ జోకర్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఏకంగా 1 బిలియన్ డాలర్స్ అంటే ఏకంగా 7300 కోట్లకు పైగా కలెక్షన్స్ ని సాధించి ఆర్ రేటెడ్ మూవీస్ లోనే కాదు.. DC కంపెనీ తరుపున…

ఆల్ టైం హైయెస్ట్ కలెక్షన్స్ ని సాధించిన సినిమాగా నిలిచింది, టోటల్ రన్ లో ఈ సినిమా 1.07 బిలియన్ డాలర్స్ ని వసూల్ చేసింది. వరల్డ్ లోనే విలన్ మూవీస్ లో ఆల్ టైం ఎపిక్ కలెక్షన్స్ ని సొంతం చేసుకున్న సినిమాగా నిలిచింది, అది కూడా నార్మల్ స్టొరీ లైన్ తో ఈ రేంజ్ భీభత్సం సృష్టించడం మాత్రం అల్టిమేట్ అనే చెప్పాలి.

Leave a Comment