న్యూస్ బాక్స్ ఆఫీస్

చరిత్ర సృష్టించిన గోపీచంద్.. ఇండియాలోనే ఫస్ట్ మూవీగా సంచలన రికార్డ్!!

యాక్షన్ హీరో గోపీచంద్ నటించిన లేటెస్ట్ మూవీ సీటిమార్ బాక్స్ ఆఫీస్ దగ్గర రీసెంట్ గా రిలీజ్ అయ్యి మాస్ ఆడియన్స్ ను బాగా అలరిస్తూ గోపీచంద్ కెరీర్ లో సాలిడ్ ఓపెనింగ్స్ ను సొంతం చేసుకున్న సినిమాగా దూసుకు పోతుంది. ఇక సినిమా రిలీజ్ కి ముందు అడ్వాన్స్ బుకింగ్స్ అంతంత మాత్రమె ఉన్నప్పటికీ రిలీజ్ రోజున అల్టిమేట్ ట్రెండ్ ను కొనసాగించిన సినిమా గోపీచంద్ కి సాలిడ్ కంబ్యాక్ మూవీ గా…

ఓపెనింగ్స్ ను మొదటి రోజు సొంతం చేసుకోగా సినిమా మొదటి రోజు సాధించిన 3.16 కోట్ల షేర్ లో ఇండియాలోనే సినిమా 3.12 కోట్ల షేర్ ని సొంతం చేసుకోగా ఇండియా లో మొదటి రోజు 4.1 కోట్ల నెట్ కలెక్షన్స్ ని 5 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను…

మొదటి రోజే సొంతం చేసుకుని సంచలనం సృష్టించగా ఈ కలెక్షన్స్ ఇప్పుడు సెకెండ్ పాండమిక్ తర్వాత ఇండియాలోనే హైయెస్ట్ ఓపెనింగ్స్ ను సొంతం చేసుకున్న రికార్డ్ ను నమోదు చేసింది. ఈ సినిమా కన్నా ముందు ఆల్ మోస్ట్ 2000 వరకు స్క్రీన్స్ లో రిలీజ్ అయిన అక్షయ్ కుమార్ నటించిన లేటెస్ట్ మూవీ…

బెల్ బాటం సినిమా మొదటి రోజు ఇండియా మొత్తం మీద 3.55 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ని మాత్రమే సొంతం చేసుకుంది, ఈ సినిమా తర్వాత హాలీవుడ్ డబ్ మూవీ షాంగ్ చీ ఇండియాలో 2200 వరకు స్క్రీన్స్ లో రిలీజ్ అయ్యి మొదటి రోజు మొత్తం మీద ఇండియాలో 4.15 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను సొంతం చేసుకుంది. ఆ రెండు సినిమాలతో పోల్చితే…

సీటిమార్ సినిమా టోటల్ గా 700 లోపు థియేటర్స్ లో ఇండియాలో రిలీజ్ అవ్వగా 5 కోట్ల రేంజ్ గ్రాస్ కలెక్షన్స్ ని అందుకోవడం మామూలు ఊచకోత కాదనే చెప్పాలి. ఈ రేంజ్ లో కలెక్షన్స్ తో టాలీవుడ్ మూవీ ప్రస్తుతానికి ఇండియాలో సెకెండ్ వేవ్ తర్వాత హైయెస్ట్ ఓపెనర్ గా సంచలన రికార్డ్ కొట్టింది. గోపీచంద్ కంబ్యాక్ మూవీ తో ఈ రికార్డ్ అందుకున్నాడు.

Leave a Comment