న్యూస్ బాక్స్ ఆఫీస్ స్పెషల్

చస్…ఇది కదా రికార్డ్ అంటే…72 ఏంటి సామి అసలు!!

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ల కాంబినేషన్ లో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ అల వైకుంఠ పురం లో బాక్స్ ఆఫీస్ దగ్గర సెన్సేషనల్ కలెక్షన్స్ రికార్డులతో దూసుకు పోతుంది, సినిమా రిలీజ్ అయ్యి ఆల్ మోస్ట్ 4 వారాలు కావస్తున్నా ఇప్పటికీ లిమిటెడ్ కలెక్షన్స్ తో రన్ అవుతున్న సినిమా లాంగ్ రన్ లో 160 కోట్ల మార్క్ వైపు అడుగులు వేస్తూ సంచలనం సృష్టించడానికి సిద్ధం అవుతుంది.

సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ క్రమం లో టాలీవుడ్ చరిత్ర లో ఆల్ టైం నాన్ బాహుబలి మూవీస్ లో బిగ్గెస్ట్ ప్రాఫిట్ ని సొంతం చేసుకుని సంచలన రికార్డ్ ను నమోదు చేసిన విషయం తెలిసిందే, ఇది వరకు మీడియం రేంజ్ మూవీ అయిన గీత గోవిందం సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర…

ఏకంగా 70.40 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోగా ఓవరాల్ గా ప్రాఫిట్ 55.4 కోట్ల మార్క్ ని అధిగమించి సరికొత్త రికార్డ్ ను నమోదు చేసింది, ఇక ఇప్పుడు అల్లు అర్జున్ అల వైకుంఠ పురం లో సినిమా 84.34 కోట్ల బిజినెస్ కి ఇప్పటి వరకు 156.6 కోట్లకు పైగా షేర్ ని వసూల్ చేయగా…

టోటల్ గా ప్రాఫిట్ బిజినెస్ నుండి ఏకంగా 72.2 కోట్లకు పైగా వచ్చింది, ఇది టాలీవుడ్ చరిత్ర లోనే సరికొత్త రికార్డ్ అని చెప్పొచ్చు. ఈ సినిమా సాధించిన ఈ రికార్డ్ ఇప్పట్లో బ్రేక్ అవ్వడం కష్టమే అని చెప్పాలి. పెద్ద చిన్న సినిమాలు తేడా లేకుండా మీడియం బిజినెస్ తో…

భారీ వసూళ్లు సాధిస్తే తప్పితే ఈ రికార్డ్ బ్రేక్ అవ్వడం కష్టమే. ఇదే సినిమా కి పోటి గా రిలీజ్ అయిన మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు కూడా 99.3 కోట్ల బిజినెస్ కి 136.4 కోట్లకు పైగా షేర్ ని అందుకుని ఆల్ మోస్ట్ 37.1 కోట్లకు పైగా ప్రాఫిట్ ని సొంతం చేసుకుని మహేష్ కెరీర్ లో బిగ్గెస్ట్ ప్రాఫిటబుల్ మూవీ గా నిలిచి సంచలనం సృష్టించింది.

Leave a Comment